తిరుమలలో మంత్రి హరీష్‌రావుకు అవమానం...

సోమవారం, 6 జనవరి 2020 (19:20 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావుకు తిరుమలలో అవమానం ఎదురైంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంత్రి తిరుమలకు వచ్చారు. కాగా మంత్రి హోదాలో వచ్చిన హరీష్ రావుకు టీటీడీ ప్రోటోకాల్ పాటించలేదు. దీంతో టీటీడీ వైఖరి పట్ల మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి వెళ్లేందుకు నిరాకరించారు. అయితే టీటీడీ పాలకమండలి సభ్యుడు దామోదర్ దౌత్యంతో హరీష్ రావు తిరిగి శ్రీవారి దర్శనానికి వెళ్లారు.
 
కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి తలసాని..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తుమ్మలగుంట లోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటేత్తారు.. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజంపేట మిథున్ రెడ్డి తదితరులు స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు.. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు