మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డికి మరోసారి అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన రోడ్డుప్రమాద మృతుల బంధువులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇవ్వడానికి పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ రెడ్డితో కలిసి వెళ్ళిన బొజ్జలను అడ్డుకున్నారు మునగలపాళెం గ్రామస్తులు. బొజ్జల మైక్ తీసుకుని ప్రసంగం ప్రారంభించే లోపే గ్రామస్తులు నీవల్లే ఊరు వల్లకాడైపోయిందని, అప్పుడే పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బొజ్జలను ప్రశ్నించారు.