సీఎం జగన్‌కు సారీ చెబుతున్నా... పిల్లి పార్టీ వీడినట్టేనా?

బుధవారం, 26 జులై 2023 (14:25 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సారీ చెప్పారు. అయితే, తాను పార్టీ వీడుతానన్న అంశంపై ఆయన స్పష్టమైన క్లారిటీ ఇచ్చినప్పటికీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీంతో ఆయన పార్టీ వీడటం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. 
 
గత కొన్ని రోజులుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కు రాజ్యసభ సభ్యులైన పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు మధ్య తీవ్ర స్థాయిలో కోల్డ్ వార్ జరుగుతోంది. దీంతో చంద్రబోస్ జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా, పార్టీ వీడుతానని వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరిగింది.
 
దీనిపై పిల్లి సుభాష్ చంద్రబోస్ క్లారిటీ ఇచ్చారు. కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొన్నపుడు వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నేతలతో ఉంటుందన్నారు. అదే సమయంలో తాను వైకాపాను వీడుతానన ఎన్నడూ చెప్పలేదన్నారు. కానీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పిన మాట నిజమేనని తెలిపరు. ఆ వ్యాఖ్యలు కూడా ఎంతో బాధతో చేశానని ఈ విషయంలో సీఎం జగన్‌కు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు