ఇకపై నా పేరు పద్మనాభ రెడ్డి, గెజిట్ సిద్ధం చేసాను: ముద్రగడ పద్మనాభం (video)

ఐవీఆర్

బుధవారం, 5 జూన్ 2024 (11:39 IST)
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడిస్తానని, ఆయనను ఓడించలేకపోతే తన పేరును పద్మనాభ రెడ్డిగా పేరును మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పవన్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ముద్రగడ పద్మనాభం తన వైసిపి పార్టీ కార్యాలయం నుంచి ఓ వీడియోను షేర్ చేసారు.
 
తను చెప్పినట్లుగా పవన్ కల్యాణ్ ను ఓడించలేకపోయాననీ, ఈ ఎన్నికల్లో నేను ఓడిపోయాననీ, నా సవాల్ ఓడిపోయింది కనుక ఇచ్చిన మాట ప్రకారం తను పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకుగాను గెజిట్ కూడా సిద్ధం చేసాననీ, అన్ని పేపర్లను సబ్ మిట్ చేసి పేరు మార్చుకుంటానని వాగ్దానం చేస్తున్నట్లు వెల్లడించారు.
 
కాగా పద్మనాభం సవాల్ విసిరిన నాడే జనసేన కార్యకర్తలు ఆయనపై విరుచుకుపడ్డారు. ఏకంగా నూతన నామకరణ మహోత్సవ ఆహ్వానం పేరిట ఓ ఇన్విటేషన్ సైతం ముద్రించారు. అందులో ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు నామకరణం అంటూ పేర్కొన్నారు.

ముద్రగడ పద్మనాభం కామెంట్స్*

నా పేరు పద్మనాభ రెడ్డి గా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నాను

సవాలులో నేను ఓడిపోయాను కాబట్టి నా పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాను

జనం కోసం కష్టపడ్డ జగన్ ని గౌరవించకపోవడం బాధాకరం

నా రాజకీయ ప్రయాణం జగన్ తోనే కొనసాగుతుంది. pic.twitter.com/1pFfEesoVJ

— ???????? సిద్దం(@YSR175) June 5, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు