గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ సమయానికి సేకరించిన ధాన్యం 4.43 మెట్రిక్ టన్నులని.. బాధ్యతతో కూటమి ప్రభుత్వం సేకరించిన ధాన్యం 9.14 మెట్రిక్ టన్నులన్నారు. వాస్తవ లెక్కలు చూస్తే జగన్ నిర్వాకం తెలుస్తోందన్నారు. సేకరించిన 24 గంటల్లో రైతు ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామని తెలిపారు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా వివరాలను వెల్లడించారు.
బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు
తమిళనాడు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మేం బెయిల్ ఇచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది అంటూ న్యాయమూర్తి అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది.
అయితే, సెంథిల్ బాలాజీ బెయిల్‌పై పునరాలోచన లేదని, అతడి బెయిల్ రద్దు చేయబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. కానీ సాక్షుల ఆందోళనకు గురవుతారన్న అంశాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకుంటామని, ఈ అంశం వరకు విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.