18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సెల్వి

మంగళవారం, 29 జులై 2025 (13:49 IST)
Nagarjuna Sagar
భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నాయి. నాగార్జున సాగర్ జలాశయం పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. దీనితో అధికారులు ప్రాజెక్టు క్రెస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 
 
జూలై నెలలో సాధారణ షెడ్యూల్ కంటే ముందుగానే గేట్లు తెరవడం 18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి. జలాశయం పూర్తి స్థాయి 590 అడుగులు (312.04 టీఎంసీలు), ప్రస్తుతం ఇది 586.60 అడుగులు. 
 
ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, "నాగార్జున సాగర్‌కు జవహర్ లాల్ నెహ్రూ పునాది వేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దీనికి ఊతం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ 26 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు జీవనాడి" అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు