నందమూరి హరికృష్ణ మృతికి తెలుగు రాష్ట్రాల్లో సంతాపం వ్యక్తం చేస్తుంటే, తెలుగు భాషాభిమానులకు ఆయన ఈరోజే మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, కారణం ఈరోజు తెలుగు భాషా దినోత్సవం.
రాజ్యసభలో తెలుగులో మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నాడు హరికృష్ణ ధ్వజమెత్తారు. తెలుగులో మాట్లాడనీయకుండా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై హరికృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా ఆయన తెలుగు కోసం తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదిలేసుకున్నారు. ఆ సంఘటనతో ఆయన తెలుగు భాషాభిమానులకు బాగా దగ్గరయ్యారు.