నందమూరి జానకీరామ్ ఫేస్‌బుక్ అంతా తాత ఎన్టీఆర్ గుర్తులే..!

ఆదివారం, 7 డిశెంబరు 2014 (13:34 IST)
నల్గొండ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ నిత్యం తన తాత, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మృతులతోనే కాలం వెళ్లదీస్తూ వచ్చారు. తాతపై తనకున్న ఇష్టానికి నిదర్శనంగానే తన కుమారుడికి నందమూరి తారక రామారావు అనే పేరును పెట్టుకున్నారు. తాతతో తన స్మృతులను నెమరువేసుకునే క్రమంలో జానకీరామ్ తన ఫేస్ బుక్‌ను తాతతో తను దిగిన ఫొటోలతో నింపుకున్నారు కూడా.
 
అంతేకాక స్వర్గీయ ఎన్టీఆర్‌కు సంబంధించిన కార్టూన్లు, ఫొటోలను కూడా జానకీరామ్ భద్రంగా దాచుకున్నారు. జానకీరామ్ మృతి నేపథ్యంలో... 1977లో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన చాణక్యచంద్రగుప్త సినిమా షూటింగ్ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు చిన్నారి జానకీరామ్‌ను ఎత్తుకుని ఉన్న ఫొటో ఫేస్ బుక్‌లో దర్శనమిచ్చింది. నాడు తన తాత ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో కలిసి ఫొటో దిగే అవకాశం రావడం తన అదృష్టమేనని ఆ ఫొటోకు జానకీరామ్ తన వ్యాఖ్యను జోడించారు. 

వెబ్దునియా పై చదవండి