అయితే, భూమా నాగిరెడ్డి అపస్మారకస్థితిలోకి చేరుకోవడంతో తక్షణం ఎయిర్ ఆంబులెన్స్ ద్వారా హైదరాబాద్‌కు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా, భూమా నాగిరెడ్డి ఆరోగ్యం కుదుట పడాలని ప్రార్థనలు చేయాలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అంతేకాకుండా, భూమా త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
అదేసమయంలో భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా రెడ్డితో ఫోనులో మాట్లాడిన చంద్రబాబు.. ధైర్యంగా ఉండాలంటూ సలహా ఇచ్చారు. మరోవైపు భూమా నాగిరెడ్డి గుండెపోటుకు గురయ్యారన్న వార్త తెలుసుకున్న ఆయన అనుచరులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు.
పార్టీ కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడుతుండగా హఠాత్తుగా ఆయన కుప్పకూలారు. దీంతో అప్రమత్తమైన అనుచరులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అహోబిలంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు. తన తండ్రికి గుండెపోటు వార్త వినడంతో ఆమె హుటాహుటీన నంద్యాల బయల్దేరారు.