జోగయ్యగారూ.. అప్పుడేం చేస్తున్నారు.. జగన్ వచ్చాకే తెలిసిందా?

సోమవారం, 15 జులై 2019 (10:29 IST)
ప్రముఖ మాటల, గేయ రచయిత దరివేముల రామజోగయ్య శాస్త్రి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవార్డుల ప్రధానోత్సవంపై విజ్ఞప్తి చేశారు. 2014 నుంచి 2016 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులను ప్రకటించింది. అయితే ఆ అవార్డుల బహూకరణ కార్యక్రమం ఇంతవరకు జరగలేదని.. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకురావాలనే ఈ ట్వీట్ చేస్తున్నట్లు చెప్పారు. 
 
నంది అవార్డులను ఇచ్చేలా చర్యలు చేపట్టాలని జగన్ విన్నవించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్‌ను పెట్టగా, నెటిజన్ల నుంచి ట్రోలింగ్స్ మొదలయ్యాయి. 
 
ఐదేళ్ల నాటి విషయంలో మొన్నటివరకు ఏం చేశారని కొందరు ప్రశ్నించగా, మరికొందరు మాత్రం రాష్ట్ర విభజన జరిగిన ఆ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ అవార్డులు ఎప్పటికీ రావంటున్నారు. గడచిన నాలుగేళ్లలో చంద్రబాబును ఇదే విషయంపై ఎందుకు అడగలేదని ప్రశ్నిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు