30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి సీఎం జగన్ బంపర్ ఆఫర్... SVBC చైర్మన్ పోస్ట్...

శనివారం, 13 జులై 2019 (14:56 IST)
సీనీయర్ కమెడియన్, వైసీపీ నేత పృథ్వీకి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అదిరపోయే ఆఫర్ ఇచ్చారు. ప్రముఖ కమెడియన్, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీకి ఏపీ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. 
 
శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ చైర్మన్‌గా పృథ్వీని సీఎం జగన్ నియమించబోతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే పృథ్వీకి సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలో అధికారిక ఉత్తర్వులు కూడా వెలువరించనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు