బుల్లి బాబు ఆస్తులు రూ. 11.32 కోట్లని చెప్పేశారు... మరి నీ బెంగళూర్ ప్యాలెస్ లెక్కేంటి జగనూ... బొండా ప్రశ్న

గురువారం, 20 అక్టోబరు 2016 (15:25 IST)
బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ తమ కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బ్రహ్మణి, భువనేశ్వరి ఆస్తులతోపాటు ఈసారి నారా దేవాన్ష్ ఆస్తులు కూడా వెల్లడించారు. నారా దేవాన్ష్ ఆస్తుల విలువ రూ. 11.32 కోట్లు. ఈ వివరాలపై తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమ మాట్లాడుతూ... మా నాయకులు చిత్తశుద్ధితో వారివారి ఆస్తులు ప్రకటించారు. మరి మీ సంగతేమిటి అని జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల చిట్టాలో బెంగళూరు ప్యాలెస్, హైదరాబాదు లోటస్ పాండ్ గురించి చెప్పలేదేమని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి తన ఆస్తులను ప్రకటించి చిత్తశుద్ధిని తెలుపాలని డిమాండ్ చేశారు.
 
కాగా నిన్న బుధవారం నాడు నారా లోకేష్ వెల్లడించిన ఆస్తుల వివరాలు...
 
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తులు
* చంద్ర‌బాబు మొత్తం ఆస్తులు రూ. 3.73 కోట్లు
* చంద్ర‌బాబు పేరిట బ్యాంకు రుణం రూ 3.6 కోట్లు 
* చంద్ర‌బాబు నిక‌ర ఆస్తులు రూ. 6.7 కోట్లు
* హైద‌రాబాద్‌లోని నివాసం విలువ రూ. 3.68 కోట్లు
* చంద్ర‌బాబు అంబాసిడ‌ర్ కారు రూ. ల‌క్షా 52 వేలు.
* చంద్ర‌బాబు ఖాతాలోని న‌గ‌దు రూ.3 ల‌క్ష‌ల 59 వేలు 
 
నారా భువ‌నేశ్వ‌రి ఆస్తులు
* భువ‌నేశ్వ‌రి పేరిట ఉన్న మొత్తం ఆస్తులు రూ. 38.66 కోట్లు
* అప్పులు రూ.13 కోట్లు
* నిక‌ర ఆస్తులు రూ 24.84 కోట్లు
* పంజాగుట్ట‌లో ఉన్న స్థ‌లం విలువ రూ. 73 ల‌క్ష‌లు 
* త‌మిళ‌నాడులోని భూమి విలువ రూ. 1.86 కోట్లు
* మ‌దీనాగూడ‌లోని భూమి విలువ రూ.73 ల‌క్ష‌లు... 
* హెరిటేజ్ ఫుడ్‌లో భువ‌నేశ్వ‌రి వాటాల విలువ రూ. 19.95 కోట్లు 
* ఇతర కంపెనీల్లోని భువ‌నేశ్వ‌రి పేరిట ఉన్న వాటాల విలువ రూ. 3.28 కోట్లు
* భువ‌నేశ్వ‌రి పీఎఫ్ ఖాతా నిలువ రూ. 1.73 కోట్లు 
* భంగారు ఆభ‌ర‌ణాల విలువ రూ. 1.27 కోట్లు
* కారు విలువ రూ.91 ల‌క్ష‌లు
 
 
నారా లోకేశ్‌ ఆస్తులు
* మొత్తం ఆస్తుల విలువ రూ. 14.50 కోట్లు 
* అప్పుల విలువ రూ. 6. 35 కోట్లు
* నిక‌ర ఆస్తుల విలువ రూ. 8.15 కోట్లు
* హెరిటేజ్ ఫుడ్స్‌లో లోకేశ్ వాటాల విలువ రూ. 2. 52 కోట్లు
* ఇత‌ర కంపెనీల్లోని వాటాల విలువ రూ. 1.64 కోట్లు
* నారా లోకేశ్ పేరిట ఉన్న కారు విలువ రూ.92 లక్ష‌లు
 
నారా బ్రాహ్మ‌ణి ఆస్తులు
 
* బ్రాహ్మ‌ణి పేరిట ఉన్న మొత్తం ఆస్తులు రూ. 12. 75 కోట్లు
* అప్పులు రూ.42 ల‌క్ష‌లు
* నిక‌ర ఆస్తులు రూ. 12. 33 కోట్లు 
* మాదాపూర్‌లో బ్రాహ్మ‌ణి పేరిట ఉన్న భూమి విలువ రూ.17 ల‌క్ష‌లు
* జూబ్లిహిల్స్‌లో బ్రాహ్మ‌ణి పేరిట ఉన్ ఇంటి విలువ రూ. 3. 50 కోట్లు
* హైద‌రాబాద్లో ఉన్న వాణిజ్య స్థ‌లం విలువ రూ.48 ల‌క్ష‌లు
* మ‌ణికొండ‌లో ఉన్న స్థ‌లం విలువ రూ. 1.23 కోట్లు
* హెరిటేజ్ ఫుడ్స్‌లో వాటాల విలువ రూ.78 ల‌క్ష‌లు
* ఆభ‌ర‌ణాల విలువ రూ.15 ల‌క్ష‌లు
* పీఎఫ్ ఖాతాలో రూ. 19 ల‌క్ష‌లు
* ఖాతాలోని న‌గ‌దు నిల్వ రూ.25 ల‌క్ష‌లు
 
నారా దేవాన్ష్ ఆస్తులు
* దేవాన్ష్ పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ. 11.32 కోట్లు
* జూబ్లిహిల్స్‌లోని దేవాన్ష్ పేరిట ఉన్న ఇంటి విలువ రూ. 9. 17 కోట్లు
* పిక్స్‌డ్ డిపాజిట్లు రూ. 2.04 కోట్లు
* దేవాన్ష్ ఖాతాలోని న‌గ‌దు నిల్వ రూ.2 ల‌క్ష‌ల 31 వేలు

వెబ్దునియా పై చదవండి