ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

బుజ్జి

బుధవారం, 14 మే 2025 (16:28 IST)
నీ వైపు నా అడుగు
నాతో కలిసి నీ అడుగు
ఏకమై ప్రేమ పయనమై సాగెనులే
 
నీ కనులతో నా కనులు
నాతో జత కలిసెను నీ కంటిపాపలే
మన నయనాలు ఏకమై కుదిరేలే
 
నీ కౌగిలి సోయగాల పందిరిలో
నా యవ్వనం మల్లెతీగై అల్లుకొనెనులే
వెండివెలుగుల నీ స్పర్శ జాబిల్లిలో ఆడెనులే
 
మన తనువులు ఏకమై ఏరువాక సాగించెనులే
ప్రతి రోజూ నాలో నీ ప్రేమ నిత్యనూతనమే
ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే
ప్రతి రేయి నా మనసు మందిరమై నీకై వేచెనులే

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు