తెలుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్ప నుంచి పాదయాత్రను చేపట్టారు. ఈ యాత్ర ఆదివారానికి మూడో రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో భాగంగా, ఆదివారం శాంతిపురంలోని వివిధ వర్గాల మహిళలతో లోకేశ్ సమావేశమయ్యారు.
మద్యం తయారీ, పంపిణీ, అమ్మకం.. ఇలా అన్ని చోట్లా జగన్ బినామీలే ఉన్నారన్నారు. 45 ఏళ్లు దాటిన మహిళలకు పింఛను ఇస్తానన్న హామీ ఏమైందని జాదూ రెడ్డి అని లోకేశ్ ప్రశ్నించారు. ఎన్నో ఆంక్షలతో అమ్మఒడి లబ్ధిదారులను తగ్గించారని ఆరోపించారు. చట్టం లేకుండానే దిశ పీఎస్‌లు, వాహనాలు అంటూ మోసం చేస్తున్నారన్నారు. మహిళలపై అఘాయిత్యాలు చేసిన ఎంతమందికి 21 రోజుల్లో ఉరిశిక్ష వేశారని ఆయన నిలదీశారు.