ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి పెద్దల సభలో మొదటిసారి అడుగుపెట్టిన నారా లోకేష్‌కు అదృష్టం మీద అదృష్టం వరిస్తోంది. అసలు ప్రజాప్రతినిధిగా కూడా పోటీ చేయకుండా కేవలం పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికై నేరుగా పెద్ద సభలోకి వెళ్ళారు నారా లోకేష్. కుమారుడిని ఆలస్యంగా తీసుకొచ్చిన చంద్రబాబు కేబినెట్లో మంచి స్థానం ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారట. అందుకే లోకేష్ బాబుకు కీలక శాఖ ఇవ్వాలనుకుంటున్నారని తెలుస్తోంది. అది కూడా హోంమంత్రేనట.
ఇక ఆ శాఖను తన కుమారుడికి ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చేశారట. కనీస అనుభవం లేకుండా హోం శాఖను ఏ విధంగా నారా లోకేష్ ముందుకు తీసుకెళ్ళగలరంటూ కొందరు సీనియర్ మంత్రుల వాదన చేస్తున్నారట. అయితే బాబును కాదని ఎవరూ అడ్డుచెప్పలేరు కదా. అందుకే సైలెంట్‌గా ఉన్నారట. ఎక్కువగా మాట్లాడితే ఉన్న పదవి కూడా ఊడిపోతోందనేది మంత్రుల భయంగా వున్నట్లు చెప్పుకుంటున్నారు.