అమ్మఒడి కాస్త అర్థ ఒడిగా మారిపోయింది : నారా లోకేశ్

శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (15:30 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు సెటైర్లు వేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ఒకటైన అమ్మఒడి పథకం ఇపుడు అర్థఒడిగా మారిపోయిందంటూ విమర్శలు చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లడుతూ, తేదీల మతలబుతో ఒక యేడాది ఎగ్గొట్టి, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 కోట్ల కోత పెట్టి అర్థ ఒడిగా మారిన పథంపై ఇపుడు ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. 
 
300 యూనిట్లకు పై బడిన కరెంట్ వాడితో పథకం కట్ అంటూ కొత్త నిబంధన తెరపైకి తెచ్చారని, ప్రతి  విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి, ఆధార్‌లో కొత్త జిల్లాల నమోదు, కొత్త బియ్యం కార్డు ఉంటే అమ్మఒడి వంటి పథకం వర్తించదని కండిషన్లు పెట్టారనీ, ఈ నిబంధనలన్నీ ముందే ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు