ఏజెన్సీలో పోలీసులే టార్గెట్ ... మావోయిస్టుల “బూబీ ట్రాప్” !

శనివారం, 9 అక్టోబరు 2021 (10:32 IST)
ఏజెన్సీలో మావోయిస్టులు పెద్ద ఎత్తుగ‌డే వేశారు. భ‌ద్ర‌తా ద‌ళాలే టార్గెట్ గా బూబీ ట్రాప్ వేశారు. నిరంతర తనిఖీలలో భాగంగా ఏజెన్సీ ప్రాంతం అయిన ఆంధ్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మల్లం పేట గ్రామ అటవీ ప్రాంతంలో చింతూరు  ఎఎస్పీ కృష్ణ కాంత్, నేతృత్వం లో చింతూరు, ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ ల సంయుక్త ఆధ్వర్యంలో యాంటీ నక్సల్ స్క్వాడ్, సిఆర్పిఎఫ్ బలగాలు ఏరియా మినేషన్ లో  భాగంగా కూంబింగ్ చేసే సందర్భంలో మావోయిస్టులు వ్యూహాత్మక దాడులలో ఒకటిగా భావించే 10 బూబీ ట్రాప్ లను అమర్చారు. వీటిని కూంబింగ్ సందర్భంగా భద్రతా బలగాలు గుర్తించాయి. 
 
భూమిలో లో పది అడుగుల లోతు వరకు కందకాలను త‌వ్వి దానిలో వెదురు బొంగులను బాణాల మాదిరిగా  సూది మొనలా చెక్కి ఆకులు అలములతో కప్పారు. కూంబింగ్ కు వచ్చే భద్రత బలగాలని వాటిలో చిక్కుకుని వెదురు బొంగుల బాణాలు గుచ్చుకునేలా ఏర్పాటు చేశారు. మావోయిస్టులు వ్యూహాత్మక యుద్ధ తంత్రంలో భాగంగా భద్రతా బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి వాటిలో చిక్కుకుని పోలీస్ బలగాలకు అపార నష్టం కలిగించే విధంగా ఏర్పాటు చేసినటు వంటి ఈ బూబీ ట్రాప్ లను  కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలు గుర్తించి ధ్వంసం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు