సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రాలేదని, అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. అలాగే కె అనే మందును కమిటీ ముందు చూపించకపోవడంతో దానికి కూడా అనుమతి నిరాకరించింది.
అయితే మందును తీసుకోవడానికి కొవిడ్ పాజిటివ్ రోగులు రాకుండా ఉండాలని ప్రభుత్వం సూచించింది. రోగులకు బుదులు వారి కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి మందును తీసుకెళ్తే కొవిడ్ విస్తరించే ప్రమాదం తప్పుతుందని చెప్పిన ప్రభుత్వం.. మందు పంపిణీలో కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించింది.