అయితే అతనో దొంగ బాబా అని ప్రజలకు తెలియడంతో ఆత్మాహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నగరంలోని ప్రశాంతినగర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తోన్న సుధాకర్ అనే వ్యక్తి బాబాగా మారాడు. ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలే పెట్టుబడిగా, బాబాలపై భక్తులకు ఉన్న నమ్మకమే ఆసరాగా మహారాజ్ బాబాపేరుతో ప్రజలను నమ్మించాడు.
భక్తులు ఇచ్చిన డబ్బును బస్తాల్లో వేసిన సుధాకర్ ఇటీవల అర్ధరాత్రి ఓ చోటుకి తరలించాలని చూశాడు. ఆ క్రమంలో ఆయన వద్ద పనిచేసే నలుగురు సిబ్బంది ఆ డబ్బంతా తీసుకుని పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆయన ఆశ్రమం వద్దకు భారీగా తరలివచ్చారు. దీంతో సుధాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫలితంగా ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.