తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. తన వద్ద చదువుకునే అమ్మాయిలపై కన్నేశాడు. అలా 15 మందిని ట్రాప్ చేసి ప్రేమ పాఠాలు వల్లించసాగాడు. ఈ క్రమంలో ఓ యువతి మొబైల్ నంబరు తీసుకుని అసభ్యకర చాటింగ్ చేస్తూ, అశ్లీల ఫోటోలు పంపసాగాడు.
అంతేకాకుండా, తనతో సన్నిహితంగా మెలగాలనీ, శృంగారంలో పాల్గొనాలంటూ ఒత్తిడి చేయసాగాడు. అలాగే, ఇతర విద్యార్థినిల వద్ద కూడా ఇదేవిధంగా నడుచుకోసాగాడు. అయితే, ఉదయగిరి ప్రాంతానికి చెందిన ఓ బాధిత విద్యార్థిని నెల్లూరులో దిశా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.