నెల్లూరు మహిళ పనిమనిషిగా వెళ్లి.. సె* బానిసగా తిరిగొచ్చింది..

బుధవారం, 19 జూన్ 2019 (20:31 IST)
నెల్లూరు మహిళ బహ్రెయిన్‌కు పనిమనిషిగా వెళ్లింది. కానీ సెక్స్ బానిసగా మారిపోయింది. చివరికి భారత ఎంబసీ సాయంతో దేశానికి తిరుగుముఖం పట్టింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరుకు చెందిన ఓ మహిళకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు వున్నాడు. ఈమె ఇంటి కష్టం తీరుతుందని బహ్రెయిన్‌కు వెళ్లింది. 
 
ఆరేళ్లకు ముందు బహ్రెయిన్‌కు వెళ్లానని.. అక్కడ 13 కుటుంబాలకు ఇంటి పని చేసేందుకు వెళ్లానని.. అయితే చేసిన పనికి జీతం ఇవ్వలేదని.. చివరికి గత రెండేళ్లలో తనను సెక్స్ బానిసగా మార్చేశారని.. బలవంతంగా తనపై శృంగారానికి పాల్పడేవారని.. ఆ నరకం నుంచి బయటపడేందుకు బహ్రెయిన్‌లోని భారత విదేశాంగ శాఖ సంప్రదించానని చెప్పుకొచ్చింది. ఆమె విజ్ఞప్తికి స్పందించిన రాయబార కేంద్రం వెంటనే స్కానర్ ఆధారంగా ఎమర్జెన్సీ పాస్‌పోర్ట్ ద్వారా హైదరాబాద్ చేరుకుంది. 
 
బ్రోకర్లను నమ్మి విదేశాలకు ఉద్యోగాలకు వెళ్లే మహిళలు, పురుషులు అప్రమత్తంగా వుండాలని, పాస్ట్ పోర్టు వివరాలను నియమ నిబంధనల ప్రకారం రాయబార కేంద్రంలో రిజిస్టర్ చేయించుకోవాలని.. అప్పుడే ఇలాంటి ఇబ్బందుల్లో  విదేశాల్లో కష్టాలెదురైనప్పుడు వారిని కాపాడే వీలుంటుందని ఎన్నారై కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మవ్ తోపల్లి శ్రీనివాస్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు