అవుట్ పేషెంట్ వార్డు డస్ట్‌బిన్‌లో పసికందు లభ్యం..

శనివారం, 23 మే 2020 (18:11 IST)
నల్లకుంట ఆస్పత్రి డస్ట్‌బిన్‌లో పసికందు లభ్యమైంది. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలోని అవుట్ పేషెంట్ వార్డులో డస్ట్‌బిన్‌లో ఆ పసికందు లభ్యమైంది. ఎవరో గుర్తుతెలియని మహిళ పసికందును వదిలి వెళ్ళిపోయింది. 
 
పాపని పరీక్షల నిమిత్తం నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 5:30 ప్రాంతంలో బురఖా ధరించి వచ్చిన గుర్తు తెలియని మహిళ డస్ట్ బిన్‌లో పడవేసినట్లుగా సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు ఆమెని గుర్తిస్తున్నారు. 
 
శనివారం ఉదయం ఏడు గంటలకు వార్డు క్లీనింగ్ చేస్తున్న సిబ్బంది ఆ పసికందును గుర్తించి అధికారులకు తెలియజేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు