లో దుస్తులపై పీపీఈ కిట్ ధరించిన నర్సు.. కరోనా రోగులకు చికిత్స.. ఎక్కడ?

గురువారం, 21 మే 2020 (10:43 IST)
కరోనా వ్యాధిగ్రస్థులకు చికిత్స అందిస్తున్న నర్సులందరూ పీపీఈ కిట్లు ధరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓ నర్సు మాత్రం లోపల ఎలాంటి బట్టలు లేకుండా కేవలం లో దుస్తులతో మాత్రమే పీపీటీ కిట్ ధరించి పురుషుల వార్డులో కరోనా రోగులకు చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారమే హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన రష్యా తలా ప్రాంతంలోని రీజనల్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రీజనల్ హాస్పిటల్‌లో పనిచేసే ఓ నర్సు లోదుస్తులపై కిట్ ధరించి చికిత్స అందిస్తోంది. తో శరీరం మొత్తం బయటకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ నర్సుకి సంబంధించిన ఒక ఫోటో ని క్లిక్ మనిపించిన కొంతమంది దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారిపోయింది. అయితే హాస్పిటల్ యాజమాన్యం దీన్ని అంత సీరియస్గా తీసుకోకపోయిప్పటికీ రీజినల్ హెల్త్ మినిస్ట్రీ మాత్రం తేలిగ్గా తీసుకోలేదు.
 
సదరు నర్సు డ్రెస్ కోడ్ ఉల్లంఘించినదని దీనిపై వివరణ ఇవ్వాలంటూ హాస్పిటల్ నిర్వాహకులు ఆదేశించారు. దీనిపై నర్సు స్పందిస్తూ పీపీఈ సూట్ ధరిస్తే చాలా వేడిగా ఉంటుందని ఆ వేడిని తట్టుకోలేక లో దుస్తులు ధరిస్తున్నానంటూ వెల్లడించింది. పీపీఈ కిట్స్ పారదర్శకంగా ఉండటం వల్ల తన లోదుస్తులు బయటికి కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చింది. ఇందులో తన తప్పేమీ లేదని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు