మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ దిశగా ఏపీ సీఎం జగన్!

శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (16:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని  పునర్‌వ్యవస్థీకరించనున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలోని అనేక మందికి ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు. 
 
ఉగాది నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. ఈ కొత్త జిల్లాల్లో ఉగాది నుంచి పాలన జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. మరోవైపు, ఉగాది నాడు కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. 
 
కొత్త జిల్లాలు ఏఱ్పడితే తమకు మంత్రులుగా అవకాశం రావొచ్చని కొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అంతేకాకుండా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సీఎం జగన్ వద్ద తమ పలుకుబడిని ఉపయోగించి, లేదా ఇతర లాబీయింగ్‌ల ద్వారా మంత్రిపదవును దక్కించుకోవాలని భావిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయినప్పటికీ సీఎం జగన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రజలు ఎంత వ్యతిరేకించినా తాము అనుకున్న ప్రకారం జిల్లాలను చీల్చి వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు