నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (09:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10.15 గంటలకు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత 11 గంటలకు తాడేపల్లి మండలం కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్ర నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. 
 
ఇస్కాన్ బెంగుళూరుకు చెందిన హరేకృష్ణ మూమెంట్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరుగుతుంది. మొత్తం ఆరున్నర ఎకరాల స్థలంలో దీని నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌తోపాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇస్కాన్ బెంగుళూరు అధ్యక్షుడు మధుపండిట్ దాస్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు