లబ్ధిదారులకు సంబంధించిన హెల్త్ డేటా అందులో ఉంటుంది. ఆ కార్డుతో ఏ ఆస్పత్రికి వెళ్లినా.. వారి అనారోగ్య సమస్యల డేటా మొత్తం తెలిసిపోతుంది. రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితి సమూలంగా మార్చేస్తున్నట్టు సీఎం తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 1000 వ్యాధులకు చికిత్స అందిస్తున్నారని, వాటి సంఖ్య 2వేలకు పెంచుతామని సీఎం చెప్పారు.
ఏపీలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ ప్రైవేట్ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని సీఎం జగన్ తెలిపారు.