విశాఖపట్టణం - తిరుపతి ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి మొత్తం 16 బోగీలతో కూడిన వందే భారత్ రైలు విశాఖపట్టణంకు బయలుదేరింది. ఇదే విషయంపై వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులను సంప్రదిస్తే మాత్రం.. అలాంటిదేం లేదని వారు అంటున్నారు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య ఈ రైళ్లు నడుస్తున్నాయి. అయితే, ఈ రైళ్ళలో ఏదేని సాంకేతిక సమస్య తలెత్తితే ఈ రైలును రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా సాధారణ రైలును నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.