సికింద్రాబాద్ నుంచి వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్లను గత నెల 19న రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరికొన్ని రోజుల పాటు పొడిగించింది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో రోలింగ్ కారిడార్ బ్లాక్ కార్యాచరణ ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. పనులు ఇంకా పూర్తి కాలేదని, దీంతో ఈ నెల 16 వరకు రైళ్ల రద్దు కొనసాగుతుందని పేర్కొంటూ అన్ని రైల్వే స్టేషన్లకు సమాచారం అందించారు.
దక్షిణ రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. రద్దు చేసిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే, కాజీపేట-డోర్నకల్ (07753), డోర్నకల్-కాజీపేట మెము (07754), డోర్నకల్-విజయవాడ (07755), విజయవాడ-డోర్నకల్ (07756), భద్రాచలం రోడ్-విజయవాడ (07278), విజయవాడ-భద్రాచలం రోడ్ (07979), సికింద్రాబాద్-వరంగల్ (07462), వరంగల్-హైదరాబాద్ మెము (07463), కాజీపేట-సిర్పూరు టౌన్ (17003), 'బల్లార్షా - కాజీపేట రాంగిరి మెము (17004), భద్రాచలం రోడ్ - బల్లార్షా(17033), సిర్పూరు టౌన్ - భద్రాచలం రోడ్ (17034) ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి.
ఇద్దరు దళిత బాలికలపై అత్యాచారం
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇద్దరు దళిత బాలికలను కిడ్నాప్ చేసిన నలుగురు కామాంధులు వారం రోజుల పాటు బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. లాతేహర్ జిల్లా బరవాడీహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ బాలికలు ఇటీవల అదృశ్యమయ్యారు. మైనర్ల కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, బరవాడీహ్ ఎస్పీ అంజనీఅంజన్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
సిట్ అధికారులు చేపట్టిన దర్యాప్తులో ఆ బాలికలను గార్వాకు చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు తేలింది. ఆ తర్వాత వారి ఆచూకీ కనుగొని రక్షించింది. తమను ఓ ఇంట్లో బంధించి వారం రోజుల పాటు అత్యాచారం చేశారని బాలికలు బోరున విలపిస్తూ చెప్పారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో నలుగురు కామాంధులను అరెస్టు చేశారు.
ఉరేసుకుని ఎస్ఐ భార్య ఆత్మహత్య
ఉమ్మడి గుంటూరు జిల్లా రాజుపాలెం ఎస్ఐ భార్య మేర్లపాక నారాయణ భార్య లక్ష్మిగీత (28) బలవన్మరణానికి పాల్పడింది. తన చీరతోనే ఆమె ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. స్థానికులు వెల్లడిచిన వివరాల మేరకు.. ఉదయం భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో లక్ష్మిగీత మనస్తాపం చెంది వేరే గదిలోకి వెళ్ళి ఫ్యాన్‌కు చీరలో ఉరేసుకునంది. దీన్ని గుర్తించిన ఎస్ఐ భర్త వెంటనే తలపులు పగులగొట్టి అమెను రక్షించి పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.
ఎస్ఐ నారాయది సొంతూరు చిట్టమూరు మండలం గుణపాడు కాగా, లక్ష్మిగీతది రేణిగుంట. వీరికి మూడేళ్ల క్రితం వివాహం కాగా, మూడేళ్ల చైత్ర అనే కుమార్తె ఉంది. తమ కుమార్తె పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు వారిద్దరూ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం నారాయణ ఎస్ఐ ఉన్నతాధికారుల అనుమతితో సెలవు కూడా తీసుకున్నాడు. ఇంతలో ఏం జరిగిందో తెలియదుగానీ, పాలుతాగే పసిపాని వదిలి లక్ష్మిగీత గదిలోకి వెళ్లి చీరకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.