మరోవైపు.. తెలంగాణలోనూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనవసరమని కేంద్రం తేల్చింది. ఈ ప్రకటనలతో విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం తుంగలోతొక్కినట్టయ్యిందని తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎక్కడా రైల్వేకోచ్ ఫ్యాక్టరీ అవసరంలేదని రైల్వేశాఖ తేల్చిచెప్పడం గమనార్హం.
నిజానికి విభజన హామీల్లో ఒకటి అమరావతి రైల్వే లైన్ ఏర్పాటు. ఈ రైల్వే ప్రాజెక్టును ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 28 కిలోమీటర్ల సింగిల్ లైన్‌ను ప్రతిపాదించారు. కృష్ణాజిల్లా పెద్దాపురం మీదుగా చిన్నారావు పాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పవరం, నంబూరుల వరకు ఈ మార్గాన్ని ప్రతిపాదించారు.
అమరావతి నుంచి తిరిగి పెదకూరపాడువరకు 25 కిలోమీటర్లు, సత్తెనపల్లి నుంచి నరసారావుపేట వరకు 25 కిలోమీటర్లు సింగిల్ లైన్లకు కూడా అప్పట్లో ప్రతిపాదించారు. కానీ, ఈ లైను నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. అదేఅదనుగా భావించిన కేంద్రం...