కె.సి.ఆర్‌. ఇచ్చిన హామీలను అమ‌లు చేయాలిః తెలంగాణా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్

బుధవారం, 3 మార్చి 2021 (22:28 IST)
Telangana Exhibitors
లాక్‌డౌన్ వ‌ల్ల సినిమా హాళ్ళ యాజ‌మాన్యం చాలా న‌ష్ట‌పోయింది. సినిమా రంగం అత‌లాకుత‌ల‌మైంది. ఆ స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్‌. కొన్ని వ‌రాలు ప్ర‌క‌టించారు. అవి అమ‌లు చేయాల‌ని తెలంగాణా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ముక్త‌కంఠంతో వేడుకొంటోంది. బుధ‌వారంనాడు తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో తెలంగాణా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశం జ‌రిగింది. జిల్లాల నుంచి హాజరైన ఎగ్జిబి టర్స్ ఏక‌గ్రీవంగా ఒకే మాట‌పై వున్నారు. ముఖ్యంగా ఇటీవల చిరంజీవి నాగార్జున గారు సిఎం గారిని కలసినప్పుడు అనేక వరాలను ఎనౌన్స్ చేసారు అవి వెంటనే అమలు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందులో ముఖ్య‌మైన అంశాలు ఈ విధంగా వున్నాయి.
 
- పార్కింగ్ ఫీజు వసూలు చేసేలా థియేటర్స్ యాజమాన్యానికి పూర్తి హక్కులు ఇవ్వాలి
- కోవిడ్ కారణంగా మూతపడిన సినిమా థియేటర్స్ కరెంట్ చార్జీలు మాఫీ చేయాలి
- టిక్కెట్ రెట్లు పెంచుకునేలా, మరియు అదనంగా షో లు ప్రదర్శించేందుకు డిసెంబర్ లో ఇచ్చిన జీవో ను వెంటనే అమలు పరచాలి.
 
సుదర్శన్, దేవి థియేటర్స్ ఓనర్ గోవింద్ రాజ్ మాట్లాడుతూ, 
- ఎగ్జిబిటర్స్ ఇండస్ట్రీ సర్వైవ్ అయ్యేది పార్కింగ్, క్యాంటీన్ లే.
- ఫ్రీ పార్కింగ్ వాళ్ల మేము ఎంతో నష్ట పోతున్నాము
- నామినల్ పార్కింగ్ ఫీజు థియేటర్స్ కో కల్పించండి అని ప్రభుత్వం కి విజ్ఞప్తి చేస్తున్నాము.
- 4, 5 years బ్యాక్ మల్టీప్లెక్స్ లొ ఎక్కువ చార్జీలు వసూలు చేసారు అది తప్పే
- పార్కింగ్ చార్జీలు కల్పించండి.
 
విజయేందరెడ్డి ( ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రెటరీ ఈ విధంగా మాట్లాడారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడే పార్కింగ్ ఫీజు లు లేవు
దయచేసి పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేలా సిఎం గారి కి విజ్ఞప్తి చేస్తున్నామ.
- కరోనా టైం లో మూత పడ్డ థియేటర్స్ కి కరెంట్ ఛార్జీలు మాఫీ చేస్తామని అన్నారు అది వెంటనే జీవో ఇవ్వాలని కోరుతున్నాము.
 
సునీల్ నారంగ్( తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ) ...మాట్లాడుతూ 
- .సింగిల్ థియేటర్స్ వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వెంటనే పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేలా గవర్నమెంట్ వెంటనే జీవో ఇవ్వాలి 
- మాకు ఎన్ని ఇబ్బందులు వున్నా టాక్స్ కడుతున్నాము అందుకే గవర్నమెంట్ మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాను
 
సేవ్ థియేటర్స్ 
మురళి మోహన్ (తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్)..మాట్లాడుతూ,
- మేము కొవిద్ టైంలో కూడా ఎన్ని ఇబ్బందులు వున్నా వర్కర్స్ కి జీతాలు చెల్లించాము
- థియేటర్స్ నిలబడాలి అంటే పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకునేలా అనుమతి ఇవ్వాలి
సుదర్శన్, దేవి థియేటర్స్ ఓనర్ గోవింద్ రాజ్ మాట్లాడుతూ,
- ఎగ్జిబిటర్స్ ఇండస్ట్రీ సర్వైవ్ అయ్యేది పార్కింగ్, క్యాంటీన్ లే.
- ఫ్రీ పార్కింగ్ వాళ్ల మేము ఎంతో నష్ట పోతున్నాము
- నామినల్ పార్కింగ్ ఫీజు థియేటర్స్ కో కల్పించండి అని ప్రభుత్వం కి విజ్ఞప్తి చేస్తున్నాము.
4, 5 years బ్యాక్ మల్టీప్లెక్స్ లొ ఎక్కువ చార్జీలు వసూలు చేసారు అది తప్పే.
ఈ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి లిఖిత‌పూర్వ‌కంగా తెలియ‌జేస్తామ‌ని ఫైన‌ల్‌గా నిర్ణ‌యించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు