తెలుగు రాష్ట్రాల ప్రజలకు షాకిచ్చిన దక్షిణ మధ్య రైల్వే.. ఏంటది?

శనివారం, 27 మార్చి 2021 (14:10 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే తేరుకోలేని షాకిచ్చింది. 8 రైళ్ల సమయాలను మారుస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు రైళ్ల సమయాలను మార్చి విమర్శలు ఎదుర్కొన్న రైల్వే తాజాగా కీలకమైన రైళ్లలో మార్పులు, చేర్పులు చేసింది. ఈసారి తెలివిగా రైలు బయల్దేరే సమయం, చేరుకునే సమయాలను యధాతథంగా ఉంచి మధ్య స్టేషన్లలో రాకపోకల సమయాలను సవరించారు. 
 
కిందటి సమయాల కంటే ముందుకు తీసుకొచ్చారు. మధ్య స్టేషన్లలో పావుగంట ముందే ఈ రైళ్లు వచ్చేలా మార్పు చేశారు. దీనర్థం రైళ్లు హైస్పీడ్‌తో నడుపనున్నారు. అయితే, ఇక్కడ రెండు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సమయాల్లో ప్రైవేట్‌ రైళ్లు ఆయా స్టేషన్ల మీదుగా వెళ్లడానికి, రైల్వేశాఖకు చెందిన రైళ్లను ముందుకు పరిగెత్తించడానికైనా అయ్యుండాలి. లేదంటే ఆ మార్గాల్లో రానున్న రోజుల్లో పూర్తిగా ప్రైవేటు హైస్పీడ్‌ రైళ్లను ప్రజలకు అలవాటు చేయాలన్న ఆలోచన అయినా అయ్యిండాలి.
 
ఏది ఏమైనా ఈ మార్పులు వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గుర్తించాలని సౌత్ సెంట్రల్ రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, మార్పులు చేసిన రైళ్ళ వివరాలను పరిశీలిస్తే, 
 
* కాకినాడ పోర్టు - చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌(07644) : తెనాలి, నిడబ్రోలు, బాపట్ల, చీరాల, వేటపాలెం, ఒంగోలు, సింగరాయకొండ, కావాలి, నెల్లూరు రైల్వే స్టేషన్లకు సంబంధించిన టైమింగ్స్‌లో మార్పు జరిగింది.
 
* నాగర్‌సోల్‌ - నర్సాపూర్‌(02714) : విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు రైల్వే స్టేషన్లకు సంబంధించిన టైమింగ్స్‌లో మార్పు జరిగింది.
 
* గుంటూరు - సికింద్రాబాద్‌(07201) : గుంటూరు, పెదకాకాని, నంబూరు, మంగళగిరి, విజయవాడ, కొండపల్లి, ఎర్రుపాలెం, మధిర, బోనకాలు, ఖమ్మం, డోర్నకల్, గార్ల, మహబూబాబాద్, కేసముద్రం, నెక్కొండ, వరంగల్, కాజిపేట్ రైల్వే స్టేషన్లకు సంబంధించిన టైమింగ్స్‌లో మార్పు జరిగింది.
 
* లోకమాన్య తిలక్ ‌- కాకినాడ పోర్టు(07222) : సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, మంగళగిరి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్లకు సంబంధించిన టైమింగ్స్‌లో మార్పు చేశారు. 
 
* పూరీ - తిరుపతి(07480) : బిలాస్‌పూర్‌ - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌(07482): గుడివాడ, విజయవాడ, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, వేటపాలెం, అమ్మనబ్రోలు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, కావలి, బిట్రగుంట, నెల్లూరు రైల్వే స్టేషన్లకు సంబంధించిన టైమింగ్స్‌లో మార్పు. 
 
* విజయవాడ - విశాఖపట్నం(02718): అనకాపల్లి రైల్వే స్టేషన్‌కు సంబంధించిన టైమింగ్స్‌లో మార్పు. 
 
* విశాఖపట్నం - విజయవాడ(02717): విజయవాడ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన టైమింగ్స్‌లో మార్పు. 
 
* విజయవాడ - చెన్నై సెంట్రల్‌(02711): నెల్లూరు రైల్వే స్టేషన్‌కు సంబంధించిన టైమింగ్స్‌లో మార్పు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు