‘బాలికే భవిష్యత్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాలో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా బాలికలు బాధ్యతలు చేపట్టారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధిత బాలికకు రూ.25 వేలు పరిహారం అందించే ఫైల్‌పై శ్రావణి సంతకం చేశారు. అలాగే రాత్రి 8 గంటల తర్వాత ఉదయం 8 గంటలకు ముందు మహిళా ఉద్యోగులను అధికారిక పనుల గురించి ఫోన్‌లు చేసి ఆటంకం కలిగించకూడదని ఉత్తర్వులు జారీ చేసిన ఫైల్‌పై కూడా ఒకరోజు కలెక్టర్ సంతకం చేశారు.