జిల్లా కలెక్టరు జర్నలిస్టుల కోసం కిట్లను కలక్టరేట్ లో సమాచార శాఖ ఉప సంచాలకులు వి.మణరామ్ కు అందజేశారు. ఆ కిట్ లో పల్స్ ఆక్సీమీటర్ -1, బియ్యం -10 కేజీలు, కంది పప్పు -2 కేజీలు, పసుపు -¼ కేజీ, నెయ్యి - ½ కేజీ, డ్రై ప్రూట్స్ - ½ కేజీ, బెల్లం -1 కేజీ, చోడిపిండి -1 కేజీ మొత్తం 8 వస్తువులు ఉంటాయని తెలియజేశారు.
సదరు కిట్ లను కోవిడ్ పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు అందజేయాలన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులు వారి పాజిటివ్ రిపోర్ట్, అక్రిడిటేషన్ జెరాక్సులను డిడి కార్యాలయములో పి.ఆర్.వో వెంకటరాజు గౌడ్ (సెల్ నెం: 9121215255) ను సంప్రదించాలని కోరడమైనది.