కరోనా తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిమ్‌లు, స్టేడియాలు, స్విమ్మింగ్‌పూల్స్ మూసివేయమని ఆదేశిస్తే ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక ఇక మీదట ఏ వేడుకకైనా 50 మందికి మాత్రమే అనుమతి అని వైద్యశాఖ స్పష్టం చేసింది. 50 శాతం పరిమితితోనే ప్రజారవాణాకు అనుమతిస్తామని.. సినిమా థియేటర్లలో 50 శాతం సీట్లకు మాత్రమే అనుమతి అని తెలిపింది. అలానే ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌తో ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించింది.
కోవిడ్ చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందులను సమకూరుస్తున్నాం.. రెమిడెసివిర్ పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామన్నది. రెమిడెసివిర్ కొరత ఉంటే హెల్ఫ్‌లైన్ నంబర్లకు కాల్ చేయాలని సూచించింది. మెడికల్ ఆక్సిజన్ వినియోగాన్ని పర్యవేక్షిస్తున్నామని.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నామని వైద్య శాఖ తెలిపింది