ఉద్యోగులను వేమూరి కనకదుర్గ సొంత బిడ్డల్లా చూసుకునేవారు: చంద్రబాబు

మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (13:23 IST)
ఏబీఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్‌గా కనకదుర్గ సంస్థ అభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారు. ఉద్యోగులను ఉద్యోగుల్లా కాకుండా సొంత బిడ్డల్లా ఆమె చూసుకునేవారు. ఆమెసేవాభావం కలిగిన వ్యక్తి అని చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నా.
 
సంస్థ అభివృద్ధిలో తనదైన ముద్ర: అచ్చెన్నాయుడు
ఏబీఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ అనారోగ్యంతో చనిపోవడం బాధాకరం. ఆమె మరణ వార్త బాధించింది. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్‌గా కనకదుర్గ సంస్థ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు