శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ గారు ఆదేశాలు మేరకు కోవిడ్ మహమ్మరీ నుంచి వీధి బాలబాలికలను సంరక్షించాలిని ముఖ్య ఉద్దేశ్యముతో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముష్కాన్. కోవిడ్-19 కార్యక్రమన్ని నిర్వహిస్తు ఇందులో భాగంగా ఈ రోజు పోలీసు బృందాలు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్ వారీగా వారి పరిధిలో ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలైన చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, చైల్డ్ లైన్, మరియు ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు అధికారులు, ప్రతినిధులు సమన్వయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, హోటల్లో,కిరాణి దుకాణాలు,థాబలు, వెల్డింగ్ షాప్, మెకానిక్ షాప్, మరియు పారిశ్రామిక వాడలో అనధికారికంగా పనిచేస్తున్న అనాధ బాలలను, నిస్సహాయులుగా తిరుగుతూన్న వీధి బాల బాలికలను గుర్తుంచి కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలిని మాస్క్స్ , శానిటైజర్ అందిస్తు, కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి శానిటైజర్లతో వారి యొక్క చేతులను శుభ్రపరిచి వారికి అల్పాహారాన్ని అందించి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆచూకీని తెలుసుకుని వారికి అవగాహన కల్పించి సదరు బాలబాలికలను వారి యొక్క తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు.