కోర్టులో వీళ్ల పలుకుబడి ముందు మా పలుకుబడి చెల్లుబాటు కాలేదు: జగన్

బుధవారం, 11 నవంబరు 2020 (22:27 IST)
నంద్యాల ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై ఏపీ సీఎం జగన్ స్పంధించారు. సలాం కుటుంబం చనిపోతూ సెల్పీ తీసిన వీడియో తన దృష్టికి వచ్చిన వెంటనే ఇంకా వేరే ఆలోచన లేకుండా న్యాయబద్దంగా ఏం చేయాలో దాని ప్రకారమే చేశామని వెల్లడించారు.
 
పోలీసుల మీద ఏ ప్రభుత్వం కేసులు పెట్టదని, కానీ తమ ప్రభుత్వంలో అందరూ సమానులే. తప్పు చేసిన వారు ఎవరైనా ఒకటే. న్యాయం ఎవరికైనా ఒకటేనని తెలిపారు. గతంలో టీడీపీకి సంబంధించిన కాపు వెల్పేర్ కార్పోరేషన్ నామిని డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఇవాళ నంద్యాల నింధితుల కోసం బెయిల్ ఫిటిషన్ వేశారని సీఎం జగన్ ఆరోపించారు.
 
కోర్టులో వీరి పలుకుబడి ముందు తమ పలుకుబడి సరిపోవడం లేదని, కోర్టులో బెయిల్ కూడా తమ కళ్ల ముందే లభించిందని తెలిపారు. మంచి చేయాలని కోరుకునే ప్రభుత్వం మాది. కానీ తప్పు లేకపోయినా మాపై బురద చల్లడమే బాధాకరంగా ఉంది. ఆ బాధలోనే ఇలా మాట్లాడవలసివస్తుందని సీఎం జగన్ వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు