జగనన్న ప్రవేశపెట్టిన పథకాలే మా ఆయుధాలు: మంత్రి అనిల్ కుమార్

సోమవారం, 12 ఏప్రియల్ 2021 (22:23 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించి వారిని ఆర్ధికంగా నిలబెట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని రాజానగరం శాసనసభ్యులు,రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి తెలిపారు.
 
సోమవారం నాడు గూడూరులోని  పి.వి.అర్ కల్యాణ మండపం నందు డ్వాక్రా మహిళాల సంఘాలతో  ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారితో కలిసి రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారు, గూడూరు శాసన సభ్యులు వెలగపల్లి వర ప్రసాద్ గారు, చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ,శిoగనమల శాసన సభ్యులు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి తదితరులు పాల్గొన్నారు..
 
ఈ సందర్భంగా జక్కంపూడి రాజా గారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల సంక్షేమం కోసం పెద్దపీఠం వేస్తున్నారని అందులో భాగంగా చేయూత, ఆసరా వంటి వినూత్న పథకాలు ప్రవేశపెట్టి వారి ఆర్థిక స్వావలంబన  కల్పించడం జరుగుతుందన్నారు..
 
దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా మహిళా పక్షపాతి అయిన  వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం దిశా వంటి చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూడా నామినేటెడ్ పోస్టులలో 50 శాతం రిజర్వేషన్ మహిళలకు కేటాయించి వారిని అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పిస్తున్నారాన్నారు.
 
మహిళల కోసం నిరంతరం  శ్రమించే  మన ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు  బలపరిచిన అభ్యర్థి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేయుచున్న డాక్టర్ గురుమూర్తి గారికి మహిళలు అందరూ తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తు పై వేసి అఖండ మెజార్టీతో గురుమూర్తి గారిని గెలిపించుకోవాలి అన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు