జ‌గ‌న్ పెద్ద శ‌నిలా అడ్డంగా ఉన్నాడు‌.... పల్లె వ్యాఖ్య

గురువారం, 16 జూన్ 2016 (21:28 IST)
ఏపీ ఐటీ శాఖామంత్రి ప‌ల్లె ర‌ఘునాధ‌ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ క‌మీష‌న్ చైర్మ‌న్ శివాజీ, క‌ళ్యాణ‌ దుర్గమ్ ఎమ్మెల్యే హ‌నుమంత‌రాయ చౌద‌రిలు జ‌గ‌న్ పైన గురువారం విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ జగన్ పెద్ద శనిలా అడ్డంగా ఉన్నాడంటూ మండిపడ్డారు. జగన్ అవినీతి కేసుల కోసం కోర్టు, ఈడీ చుట్టూ తిరగడానికే సమయం సరిపోతోందన్నారు.
 
వైయస్ హయాంలో నెక్లస్ రోడ్డు, ఫ్లైఓవర్ రోడ్ల నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మళ్లించారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం యస్సీ, యస్‌టీ సంక్షేమానికి చిత్త శుద్ధితో కృషి చేస్తుందనీ, ఎస్సీ లకు సీఎం చంద్రబాబు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించారని చెప్పుకొచ్చారు. దళిత గిరిజనులకు సమ సామాజిక న్యాయాన్ని సీఎం చంద్రబాబు అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి