కాగా ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా షేక్ రషీద్ అనే యువకుడు ముండ్లమూరు బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి బయటకు వస్తుండగా... హతుడి మాజీ మిత్రులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనతో రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎస్పీ స్పందించారు. ఈ ఘటనపై టీడీపీ కూడా ధీటుగా స్పందించింది.
హతుడు షేక్ రషీద్, చంపిన వ్యక్తి షేక్ జిలానీ ఇద్దరూ వైసీపీ వారేనని, వీరిద్దరూ వినుకొండలో రౌడీగా చెలామణి అవుతున్న వైసీపీ నేత పీఎస్ ఖాన్‌కు ప్రధాన అనుచరులు అనే విషయాన్ని పేర్కొంది. జగన్ రెడ్డికి ఈ పీఎస్ ఖాన్ ప్రధాన అనుచరుడు అని మండిపడింది.