ఏపీకి హోదాపై 28 మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో చర్చ!

బుధవారం, 27 జులై 2016 (14:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయించే అంశంపై గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో చర్చ జరుగనుంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం సమావేశమైన రాజ్యసభ అఖిలపక్ష సమావేశం నిర్ణయం తీసుకుంది. 
 
ఏపీ ప్రత్యేక హోదా అంశంపై నిత్యమూ అట్టుడుకుతున్న రాజ్యసభలో, వాయిదాలు పడటం మినహా, మరే విధమైన కార్యకలాపాలూ సాగకపోవడంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ అఖిలపక్ష నేతలను పిలిచి ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. 
 
కాగా, చర్చకు మాత్రమే అనుమతిస్తామని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేయగా, దీనిపై ఓటింగ్‌కు కూడా కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే, బీజేపీ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఈ పరిస్థితుల్లో గత కొన్ని రోజులుగా రాజ్యసభ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి