పాస్‌పోర్టు కావాలంటో కోర్కె తీర్చమన్నాడు.. ఇంటికి పిలిచి రేప్

బుధవారం, 30 ఆగస్టు 2017 (06:16 IST)
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ వితంతువుపై అత్యాచారం జరిగింది. పాస్ పోర్టు పేరుతో ఓ ఏజెంట్ లైంగికదాడికి ప్రయత్నించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ఓ వితంతువు జీవనోపాధి నిమిత్తం తన ఇద్దరు పిల్లలతో కలిసి గల్ఫ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం అవసరమైన దస్తావేజులను తీసుకుని పాస్ పోర్టు కోసం హైదరాబాద్‌కు వచ్చింది. 
 
వీసా సంపాదించే ప్రయత్నాల్లో భాగంగా ఏజెంట్ కరీముద్దీన్‌ని సంప్రదించింది. ఆమెపై కన్నేసిన కరీముద్దీన్... వీసాకు సంబంధించిన విషయాలు మాట్లాడటానికి ఇంటికి రమ్మన్నాడు. దీంతో ఒంటరిగా వెళ్లగా, కోరిక తీర్చాలంటూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అయితే, ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న ఆ మహిళ... నేరుగా చార్మినార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన చార్మినార్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిని మోసం చేస్తూ, వారిపై వేధింపులకు పాల్పడుతున్న ఏజెంట్లను పట్టుకునేందుకు రెండు బృందాలు పని చేస్తున్నట్టు డీసీపీ సత్యనారాయణ చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి