Anil Ravipudi, Ramachandra Vattikuti, Rambabu parvataneni and others
రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం మటన్ సూప్. విట్‌నెస్ ది రియల్ క్రైమ్ ట్యాగ్ లైన్. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో ఆకట్టుకున్నాయి. దసరా సందర్భంగా బుధవారం, అక్టోబర్ 1 నాడు చిత్ర టీజర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.