అవినీతి గడ్డిమేసి, బాగా బలిసిన ఆంబోతు: హమ్మ అంబటిని పట్టాభి ఎంత మాటనేశాడూ?
శుక్రవారం, 29 జనవరి 2021 (08:44 IST)
పంచాయతీ ఎన్నికలకు టీడీపీ సర్వసన్నద్ధంగా ఉందని, నేతలు కార్యకర్తలు ఎన్నికల్లో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, 20నెలలుగా ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పడానికి ఏపీ పౌరులుకూడా సంసిద్ధులై ఉన్నారని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ స్పష్టంచేశారు. ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా ...!
వైసీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ప్రజలను అనేక రకాలుగా వేధిస్తూనే ఉంది. పథకాలన్నింటిలో కోతలు పెట్టి, వారిని అనేకవిధాలుగా పాలకులు మోసం చేశారు. టీడీపీ హాయాంలో పల్లెల్లో జరిగిన అభివృద్ధిని చంద్రబాబునాయుడు గారు నేడు మీడియాముఖంగా వివరించారు. టీడీపీ అభ్యర్థులను పంచాయతీ ల్లో గెలిపిస్తే, ఎలా అభివృద్ధి సాధ్యమవుతుందో ఆయన చాలాస్పష్టంగా చెప్పారు.
టీడీపీ పాలనలో రాష్ట్రంఅన్నిరంగాల్లో దేశంలోనే నెం-1 స్థానంలో ఉంటే, నేడు జగన్ పాలనలో గ్రామాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఎలా వెనకబడి ఉన్నాయో కూడా చంద్రబాబుగారు వివరించారు. టీడీపీ అభ్యర్థులను పంచాయతీ ఎన్నికల్లో గెలిపిస్తే, గ్రామాలు అభివృద్ధికేంద్రాలుగా మారుతాయని మాజీముఖ్యమంత్రి చెప్పారు.
ఆయన ప్రెస్ మీట్ పూర్తయ్యాక వైసీపీకి చెందిన అచ్చోసిన ఆంబోతులు కొన్ని ఏదిపడితే అది మాట్లాడాయి. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మేయాల్సిన గడ్డి అంతా మేసేసి ఏదేదో మాట్లాడాయి. ప్రజల రక్తాన్ని పీల్చి పోగుచేసిన సొమ్ముతో కావాల్సినంత గడ్డిని తాడేపల్లి ప్యాలెస్ నిండా ఉంచారు. ఆ గడ్డిని ఆంబోతులకు వేసి, వాటిని అప్పుడప్పుడూ రోడ్డుపైకి వదులుతారు.
ఈరోజు కూడా అలానే ఒక ఆంబోతు పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ఎలా విడుదలచేస్తారు...పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ఉంటుందా... అటువంటి అధికారం పార్టీలకు ఉంటుందా అని ఏదేదో వాగింది. టీడీపీ ప్రజలకుచెప్పిన అంశాలగురించి ఆ ఆంబోతుకు అవగా హన లేదని, దాని మెదడు చిట్లిపోయిందని మాకు అర్థమైంది.
పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగకపోయినా, జాతీయపార్టీలుగా ఉన్న అనేకపార్టీలు తాము బలపరిచిన వారిని గెలిపిస్తే, ఈ విధమైన సంక్షేమకార్యక్రమాలు అమలుచేస్తామని చాలా స్పష్టంగా చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకు సంబంధించిన మేనిఫెస్టో కూడా విడుదలచేసిన ఉదంతాలున్నాయి.
అస్సాంలో రెండేళ్లక్రితం జరిగిన పంచాయతీఎన్నికలకు సంబం ధించి, ఆరాష్ట్రానికి చెందని బీజేపీ ముఖ్యమంత్రి సర్బానంద్ సోనో వాల్ మేనిఫెస్టోను విడుదలచేశారు. తాడేపల్లి ఆంబోతు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా పంచాయతీఎన్నికల మేనిఫెస్టోల ను విడుదలచేసింది.
రాష్ట్రంలో ఉన్న దిక్కుమాలిన పార్టీ 20 నెలల నుంచీ అధికారంలో ఉండికూడా ప్రజలకు ఏంచేసింది లేదు కాబట్టి, మేనిఫెస్టో ఎందుకు అంటోంది. 2014 -19 మధ్యన టీడీపీప్రభుత్వం గ్రామాల్లో 25వేలకిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసింది. జగన్ ప్రభుత్వం వచ్చాక 20నెలల కాలంలో కేవలం 296కిలోమీటర్లు మాత్రమే వేసింది.
ఈ ఘనకార్యాన్ని చెప్పుకొని ఏడవలేరు కనుక, అధికార పార్టీ ఆంబోతులు టీడీపీమేనిఫెస్టోను తప్పుపడుతు న్నాయి. టీడీపీ ప్రభుత్వంలో 6లక్షల15వేల పంటకుంటలను తవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఎక్కడా ఒక్కపంటకుంట కూడా తవ్వలేదు. 2014-19 మధ్యన చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో 7,970పంచాయతీ భవనాలు, అంగన్ వాడీ కేంద్రాలను నిర్మించడం జరిగింది. ఈ తుగ్లక్ ప్రభుత్వం వచ్చాక అటువంటి నిర్మాణాలు గుండుసున్నా.
టీడీపీ ప్రభుత్వం కట్టిన భవనాలకు వైసీపీ రంగులేశారు. అదిమీరు చేసిన ఘనకార్యం. 22లక్షల ఎల్ ఈడీ బల్బులను గ్రామాల్లో టీడీపీ ప్రభుత్వం అమర్చింది. వైసీపీ వచ్చాక ఒక్కబల్బుకూడా వేసిందిలేదు. ఇలా అన్ని గుండుసున్నా లు చుట్టేసినవారు, పల్లెల్లో ఏంచేశామని మేనిఫెస్టోలు వేసుకుంటా ?
చంద్రబాబునాయుడి ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే తాడేపల్లి ఆంబోతులు కూసాలు కదిలాయి. దాంతో ఏంచేయాలో తెలియక పిచ్చిపిచ్చిగా రోడ్లపైకి వచ్చి అరుస్తున్నాయి. దిక్కుమాలిన పార్టీకి పంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమంఎలా చేయాలో తెలిసి ఏడిస్తే కదా? అందుకే టీడీపీపై పడి ఏడుస్తున్నారు. టీడీపీ విడుదలచేసిన మేనిఫెస్టోలో ఎక్కడైనా టీడీపీవారికి ఓటేయమని చెప్పామా?
మా పార్టీ బలపరిచిన అభ్యర్థులనుగెలిపించాలని మాత్రమే చెప్పడం జరిగింది. చదవడం రాకనా లేక చదివి నటిస్తున్నారో తెలియదు కానీ, అవినీతిసొమ్ముతో పెట్టిన బులుగుమీడియా ఉందికదా అని దానిముందుకొచ్చి రంకెలేస్తే ఎలా? ఒక ఛానల్ పత్రికచేతిలో ఉన్నాయి కదా అని తప్పుడు ప్రచారం చేస్తారా?
టీడీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేస్తే, గ్రామాలను ఈ విధంగా అభివృద్ధిచేస్తామని చెప్పాం. దానికే మాపై పడి ఏడుస్తారా? 20నెలలనుంచీ ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఏంగడ్డి పీకారో ఈరోజు మీడియాముందుకొచ్చి రంకెలేసిన ఆంబోతు సమాధానంచెప్పాలి.
పేరుకే పెద్దిరెడ్డి, ఆయన ప్రవర్తనలో, మాటల్లో ఎక్కడా పెద్దరికం అనేది మచ్చుకైనా కనిపించదు. పెద్దిరికంలేని రెడ్డని ఆయన పేరు మార్చుకుంటే మంచిది. ఆయన చరిత్ర తెలియనట్లు ఏకగ్రీవాల గురించి మాట్లాడుతున్నాడు సిగ్గులేకుండా, పుంగనూరు, తంబళ్ల పల్లె నియోజకవర్గాల్లో ఏకగ్రీవాల ముసుగులో మీరుచేసిన దాడులు, అందుకోసం పారించినరక్తాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలే దని పెద్దరికంలేని రెడ్డి తెలుసుకుంటే మంచిది.
పుంగనూరు, తంబళ్ల పల్లిలో నూటికి నూరుశాతం ఏకగ్రీవాలు ఎలా జరిగాయి. అధికారంచేతిలో ఉందని జరిగాయా? అదే ప్రతాపం 2013లో జరిగి న స్థానికఎన్నికల్లో ఏమైంది. 2013-14లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ 36 ఎంపీటీసీలు, 3జడ్పీటీసీలు గెల్చింది. పుంగనూరులో 22ఎంపీటీసీ లు, టీడీపీ కైవశం అయ్యాయి.
ఆనాడు పెద్దిరెడ్డి ప్రతాపం ఏమైంది. ఆ నియోజకవర్గం తనకు పెట్టనికోట, కంచుకోట అని పెద్దరికం లేని రెడ్డి ఏదేదో అంటున్నాడుకదా. ఆ కోటలో 2013-14 ఎన్నికల్లో ఎందుకు గెలవలేదు ఈ పెద్దిరెడ్డి. ఈనాడు అధికారం ఉందికదా అని విర్రవీగుతున్నాడు.
శాంతియుతంగా, స్వేఛ్చగా పంచాయతీఎన్నికలుజరిగితే వైసీపీకి ఓటమిఖాయమని తెలిసే, ఏకగ్రీవాల పేరుతో అధికారపార్టీ వారు నాటకాలు ఆడుతున్నారు. అందుకే వైసీపీ రౌడీమూకలను, చంద్రబాబునాయడు గారు హెచ్చరించారు. మంత్రిపెద్దిరెడ్డిని నిజంగానే బర్తరఫ్ చేయాలి. 3లక్షల60వేలమందికి ఓటుహక్కు లేకుండా చేసినందుకు, మరోఆలోచన లేకుండా మంత్రిపెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాల్సిందే.
రాజారెడ్డి స్ఫూర్తితో పనిచేస్తున్నది అధికార పార్టీనే. వైసీపీమంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు హింసకు తెగబడుతూ, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నా రు. టీడీపీనేతలు, కార్యకర్తలే అంబేద్కర్ రాజ్యాంగం స్పూర్తితో పనిచేస్తున్నారు.
నిజంగా అభివృద్ధి, సంక్షేమం అనేవి వైసీపీ ప్రభుత్వం చేసిఉంటే, ఎందుకుపంచాయతీ ఎన్నికలకు భయపడు తోంది. ఏబీఎన్, టీవీ-5ప్రసారాలు నిలిపివేస్తే, పంచాయతీఎన్నికల్లో అధికారపార్టీ సాగించే హింసాయుత కార్యక్రమాలు ప్రజలు గమనించరని జగన్ అనుకుంటున్నారా?
ప్రజలు వైసీపీని ఆదరిస్తా రనే నమ్మకం ఉంటే, ఇటువంటి దిక్కుమాలిన పనులు చేయరు. ఒకపక్కన ఏకగ్రీవాల పేరుతో ప్రతిపక్షాలకు చెందిన వారిని బెదరి స్తూ, మరోపక్కన మీడియాప్రసారాలు అడ్డుకుంటూనీచాతినీచంగా వ్యవహరిస్తున్నారు. మీడియా గొంతునొక్కేస్తామంటే టీడీపీ చూస్తూ ఊరుకోదు, ప్రజలు తెలుగుదేశం పక్షానే ఉన్నారని, అధికారపార్టీకి చెందిన అచ్చోసిన ఆంబోతులన్నీ తెలుసుకుంటే మంచిది.
ఆ ఆంబోతులకు చేతనైతే, ధైర్యముంటే, టీడీపీ మాదిరే దమ్ముగా, ధైర్యంగా 20నెలల్లో ఏంచేశారో చెప్పుకొని, పంచాయతీలకువెళ్లి ప్రజలనుఓట్లడగాలి. పంచాయతీ రాజ్ శాఖామంత్రి వైసీపీప్రభుత్వం ఏంచేసిందో మీడియాముందుకొచ్చిచెప్పాలి. ఆయనకు ధైర్య లేకపోతే ముఖ్యమంత్రిని వచ్చిచెప్పమనండి.
ఎవరు బెదిరిస్తున్నారో ఎవరు అభివృద్ధిచేశారో ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. టీడీపీ ప్రభుత్వం గ్రామాలను అభివృధ్ధి చేసింది కాబట్టే ఎన్నికలకు సిద్ధమైంది. చేసింది చెప్పుకోలేక, చేసిందేమీలేక, వైసీపీ ఆంబోతులు రోడ్లపైకి వచ్చి, ప్రతిపక్షమైన తెలుగుదేశంపై, చంద్రబాబునాయుడిపై రంకెలేస్తే వాటికొమ్ములు విరిచినేలపై పడుకోబెట్టడానికి టీడీపీకార్యకర్తులు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాను.