మైలవరం వీరప్పన్ కల్లు తాగిన కోతి: హమ్మ..వసంతకృష్ణప్రసాద్‌ను ఎంత మాటనేశాడు?
మంగళవారం, 3 ఆగస్టు 2021 (09:41 IST)
కొండపల్లి అటవీప్రాంతంలోని అక్రమమైనింగ్ వ్యవహారాన్ని, మైలవరం వీరప్పన్ వసంతకృష్ణప్రసాద్ ఏ విధంగా అక్రమమైనింగ్ సాగిస్తున్నాడో , ఏవిధంగా విలువై న గ్రావెల్ ను దోచేస్తున్నాడో ఇప్పటికే ఆధారాలతో సహా ప్రజలకు తెలియచేశామ ని, అదిచూసి ఓర్వలేని చదువురాని బడుద్దాయి అని మైలవరం వీరప్పన్ మీడియాముందుకొచ్చి కల్లతాగిన కోతిలా వింతవిన్యాసాలు చేశాడని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవాచేశారు.
ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా ..!
వసంతకృష్ణప్రసాద్ కు నచ్చనంతమాత్రాన, ఆయన ఎగిరెగిరి పడినంత మాత్రాన ఆయనకొచ్చిన మైలవరం వీరప్పన్ అనేపేరు ఎప్పటికీశాశ్వతమే. ఆయన రేపు నియోజకవర్గంలో జనాలమధ్యకు వెళితే, ప్రజలంతా అలానే పిలుస్తారు. ఆ పేరుకు కృష్ణప్రసాద్ అలవాటుపడాలి... తప్పదు. వసంత కృష్ణప్రసాద్ కు నిజంగా నిజాయితీఉంటే, అక్రమ మైనింగ్ కుసంబంధించి హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని నేను బయటపెట్టేవరకు దానిగురించి వీరప్పన్ ఎందుకు మాట్లాడలేదు.
వసంత కృష్ణప్రసాద్ తొక్కిపెట్టిన వాస్తవాలను సోషల్ మీడియాలో బయటపెట్టి, హింసిస్తున్నారు కాబట్టే, నిద్రపట్టక నేడు మీడియాముందుకొచ్చాడు. తాను మాట్లాడినదానికి వైసీపీ సోషల్ మీడియా వారు తగులుకోవాలని చెబుతున్నాడు. ఏంటి వాళ్లు తగులుకునేది....ఇప్పటికే వసంత బాగోతం తెలిసిన ప్రతిఒక్కరూ ఆయన చొక్కాపట్టుకొనే స్టేజ్ కు వచ్చారు.
హైకోర్ట్ తీర్పులో చాలాస్పష్టంగా సర్వేనెంబర్ -143 అనేది విలేజ్ సర్వేమ్యాప్ లో లేదని చెప్పింది. సదరు గ్రామానికి చెందిన ఫీల్డ్ మెసర్ మెంట్ బుక్ (ఎఫ్ ఎంబీ) లో ఆ సర్వే నెంబర్ లేదని కూడా చెప్పింది. అంటే దానర్థం తాతలకాలంనుంచే ఆ సర్వే నెంబర్ లేదని అర్థంకాదా? గతంలోలేని సర్వేనెంబర్ 143 ని ఇంక్ పెన్నుతో సృష్టంచారని కూడా హైకోర్టుతీర్పులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు.
సమాచారహక్కు చట్టంద్వారా మైనింగ్ శాఖా అధికారులు 31-01-2014న ఇచ్చిన సమాచారంతోనే, ఆసర్వేనెంబర్ ని రాజశేఖర్ రెడ్డి హాయాంలోనే సృష్టించారని చెప్పడం జరిగింది. కృష్ణా జిల్లా కు సంబంధించిన సర్వేనెంబర్ 143లో, ఏ ఒక్క లైసెన్స్ కూడా 2007కు ముందు ఇచ్చినట్లు లేదు. పోనీ రెన్యువల్ చేస్తే రికార్డుల్లో రాస్తారు. అలా రెన్యువల్ అయినవాటిగురించి అధికారులు స్పష్టంగా చెబుతారు.
అలా రాయలేదంటే సదరు సర్వేనంబర్ -143ని రాజశేఖర్ రెడ్డి హాయాంలో సృష్టించారని స్పష్టమవుతోంది. ఇచ్చిన మైనింగ్ లైసెన్సులన్నీ కూడా 2007, ఆ తరువాత మాత్రమే ఇచ్చారంటే, రాజశేఖర్ రెడ్డి హాయాంలోనే సదరు సర్వే నెంబర్ సృష్టి జరిగిందని తేటతెల్ల మవుతోంది. విలేజ్ మ్యాప్ లో , ఫీల్డ్ మెజర్ మెంట్ బుక్ లో సర్వేనెంబర్ 143 లేదనికూడా హైకోర్టుతీర్పులో ఉంది. ఇవిచాలా వసంతకృష్ణప్రసాద్ కు ఇంకేమైనా కావాలా?
కే.ఈ.కృష్ణమూర్తి అటవీభూములను రెవెన్యూభూములుగా మార్చాడని వీరప్పన్ గతంలో చెప్పాడు. ఈ రోజేమో వాస్తవాలు బయటపడేసరికి తానలా అనలేదని అంటున్నాడు. కే.ఈ.కృష్ణమూర్తి ఈ భూములకు సంబంధించి ఎలాంటి ఆర్డర్ గతంలో ఇవ్వలేదని ఆధారాలతో చెబుతున్నాము. క్వారీయజమానులు ఆయనకు ఇచ్చిన రిప్రజంటేషన్ పై, స్పందించి, రికార్డులు తెప్పించండి.. పరిశీలిస్తానని అధికారులతో చెప్పారంతే.
కే.ఈ.కృష్ణమూర్తి అటవీభూములను రెవెన్యూభూములుగా మార్చమని చెప్పారా? ఎక్కడ ఎప్పుడుచెప్పారో చదువురాని బడుద్దాయి సమాధానంచెప్పాలి. అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్పించింది జగన్మోహన్ రెడ్డి, వసంతకృష్ణప్రసాద్ లే. 17-10-2019న స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ తో వారిద్దరే ఆర్డర్ ఇప్పించారు. జగన్ ప్రభుత్వమే ఆర్డర్స్ ఇచ్చిందని తానుచెప్పేవరకు మైలవరం వీరప్పన్ వాటిని ఎందుకు తొక్కిపెట్టాడు?
అటవీభూములను రెవెన్యూ భూములుగా మార్చమని జగన్ ప్రభుత్వం ఆర్డరిస్తే, దాన్ని టీడీపీకి అంటగడతాడా? మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఉత్తర్వులలో 30-08-2019న డైరెక్టర్ అండ్ సెటిల్ మెంట్ ల్యాండర్ రికార్డ్స్ వారు ఇచ్చిన నివేదికను రిఫరెనన్స్ లో పెట్టిన మాట వాస్తవంకాదా? 30-08-2019న రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో మైలవరం వీరప్పన్ కుతెలియదా? 30-08-2019న కీలకమైన డైరెక్టర్ అండ్ సెటిల్ మెంట్ ల్యాండ్ రికార్డ్స్ వారు ఏమని నివేదిక ఇచ్చారో తెలియదా?
వారితో ఈ వీరప్పన్ ఏమని రాయించాడు? అధికారులు గతంలో రకరకాల నివేదికలు ఇచ్చారే అనుకుందాం.. మరీ ఈ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ అటవీభూములను రెవెన్యూభూములుగా మారుస్తూ ఉత్తర్వులు జారీచేసేముందు, గతనివేదికలను పరిశీలించకుండా మైలవరం వీరప్పన్ ఆయన కళ్లకు గంతలుకట్టాడా? కళ్లుమూసి ఆయనతో ఉత్తర్వులపై సంతకాలు పెట్టించాడా? చంద్రబాబునాయడు నిజాన్ని ఆయుధంగా చేసుకొమనిచెప్పారు... ఆయన చెప్పేందే తాముచేస్తాం.
ఈ ప్రభుత్వంలోనే కృష్ణాజిల్లా కలెక్టర్ గా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ , ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. మన్మోహన్ సింగ్ ఎప్పుడైతే అటవీ భూములను రెవెన్యూభూములుగా మార్చమని ఆదేశాలు ఇచ్చిన తర్వాత, కొండపల్లి అటవీప్రాంతంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ ప్రారంభమైంది. కొద్ది రోజులకు అక్కడ అక్రమ మైనింగ్ సాగిస్తున్న వాహనాలు సీజ్ కాబడ్డాయి. (8జేసీబీలు, 7 టిప్పర్లు) , పది లక్షల జరిమానా విధించడం జరిగింది, ఆరుగురు కిందిస్థాయి అటవీసిబ్బందిని సస్పెండ్ చేయడం జరిగింది.
డీఎఫ్ వో మంగమ్మను ఆకస్మికంగా బదిలీచేయడం జరిగింది. ఏమీ జరగనప్పుడు ఇన్ని పరిణామాలు ఎందుకు చోటుచేసుకుంటాయి? ఈ వ్యవహారంపై వేసిన ముగ్గురుసభ్యులకమిటీ కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, దారుణంగా తవ్వకాలు జరుగుతున్నాయని నివేదిక ఇచ్చింది నిజంకాదా? ఆగస్ట్ 14-2020న సదరుకమిటీ నివేదిక ఇచ్చినప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా ఉందిఎవరు? మైలవరం ఎమ్మెల్యేఎవరు? నువ్వుకాదా?
ముగ్గురుసభ్యుల కమిటీ నివేదికపై నేడు, మైలవరం వీరప్పన్ ఎందుకు మీడియాతోమాట్లాడలేదు ? ఈ ప్రభుత్వంలో నియమించిన ముగ్గురుసభ్యులు కమిటీ నివేదిక ఆధారంగా, కృష్ణాజిల్లా కలెక్టర్ అక్రమ మైనింగ్ ను రద్దుచేయలేదా? మైనింగ్ లీజులన్నీ రద్దయ్యాక, మైలవరం వీరప్పన్ రూ.5కోట్లతో ఉషారాణి దగ్గరకు వెళ్లలేదా? 28-12-2020న వీ.ఉషారాణి అనే అధికారిచేత మైలవరం వీరప్పన్ స్టేఆర్డర్ ఇప్పించలేదా?
వీటన్నింటి గురించి ఈ వీరప్పన్ ఈరోజు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే నీవు అటవీసంపదను దోచుకుతినే పెద్దగజదొంగవు కాబట్టే, వాస్తవాలను ఈవిధంగా తొక్కిపెట్టి, కల్లుతాగిన కోతిలా మాట్లాడతావా?
తనకేదో రాజయోగం, ధనయోగం ఉందని మాట్లాడుతున్న మైలవరం వీరప్పన్ కు, త్వరలోనే జైలుయోగం కూడా పట్టనుంది. త్వరలోనే కటకటాల్లో ఊచలు లెక్కపెడతాడు.
రాష్ట్ర హైకోర్టులో కొండపల్లి అటవీప్రాంతంలో నిర్మించిన అక్రమరహాదారిపై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ గోస్వామిగారు మొన్న కొన్నికీలకవ్యాఖ్యలు చేశారు. అక్కడున్న పంటకాలువను పూడ్చేసి, దానిపై రహదారి, క్రషర్ నిర్మాణాలు చేపట్టినవారు కొండపల్లి అటవీభూములను ఆక్రమించి అక్రమ మైనింగ్ కు పాల్పడలేదంటే ఎలా నమ్మాలి అని వ్యాఖ్యానించారు. జూలై 31న మీ పకోడి పేపర్లో కూడా ఈవార్త రాశారు.
కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమమైనింగ్ జరగలేదంటే తాము నమ్మమని హైకోర్టే చెప్పింది. కల్లుతాగిన కోతిలా మీడియాముందు ఎగరడం మానేసి, మైలవరం వీరప్పన్ తన కట్టుకథలన్నీ న్యాయస్థానంలోచెప్పాలి. సర్వే నెంబర్ 143 రిజర్వ్ ఫారెస్ట్ అని మొన్నటికి మొన్న (30-07-2021)న అడంగల్ కాపీని ఈ ప్రభుత్వమే మాకు అందించింది. దానికి ఏమంటారు ఈ మైలవరం వీరప్పన్?
వీరప్పన్ పోలీస్ ఎఫ్ఐఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదు. పోలీసులు అక్కడున్నది ఇల్లీగల్ మైనింగ్ అని వారురాసిన ఎఫ్ఐఆర్ లో చెప్పారు. మైలవరం వీరప్పన్ కావాలనే తిమ్మినిబమ్మిని చేశాడు.. జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాడా? మీ నాయకుడి దెబ్బకు ఎన్నిపరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయావో వీరప్పన్ కుతెలియదా? జేట్యాక్స్ లు కట్టలేకనే కదా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లులూ గ్రూపు , రిలయన్స్ లు పారిపోయింది నిజంకాదా?
మీ ఉడతఊపులకు , తాటాకు చప్పుళ్లకు భయపడను. రెండేళ్లనుంచి నన్ను భయపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు... చేస్తూనే ఉన్నారు. నన్ను బెదిరించే ముందు వీరప్పన్ తనస్థాయి ఏమిటో తెలుసుకోవాలి. అటవీసంపదను దోచుకుంటున్న మైలవరం వీరప్పన్ కు శిక్షపడేవరకు వదేలేదేలేదు. ఒకటికి వెయ్యిసార్లు ప్రజలకు వాస్తవాలు చెబుతూనేఉంటాము. నారా లోకేశ్ విద్యాభ్యాసంపై మైలవరం వీరప్పన్ చేసిన ఆరోపణలు సత్యదూరం.
స్టాన్ ఫోర్డు యూనివర్శిటీలోని తన చదువుపై లోకేశ్ కు సదరు యూనివర్శిటీ డీన్ గార్త్ సలనర్ డిసెంబర్ 14, 2011న లేఖరాశాడు. నారాలోకేశ్ లో ఉన్న నాయకత్వ లక్షణాలు, ప్రతిభను గమనించే తాము అడ్మిషన్ ఇచ్చామని డీన్ తనలేఖలో చెప్పారు. సదరులేఖతోపాటు, స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీకి నారాభువనేశ్వరి గారు ఎప్పుడెంత ఫీజు చెల్లించారనే వివరాలను కూడాజతచేశారు. మైలవరం వీరప్పన్, వైసీపీ పేటీఎం బ్యాచ్ మరోసారి నారాలోకేశ్ విద్యాభ్యాసం గురించి మాట్లాడితే వారిని కోర్టుకీడుస్తాం.
తాను అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానంచెప్పే ధైర్యం వీరప్పన్ కు ఉందా? కొండపల్లి మైనింగ్ పై జగన్ ప్రభుత్వం నియమించిన ముగ్గరుసభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఏం చెబుతాడు? కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మైనింగ్ లీజులు రద్దుచేస్తూ ఇచ్చిన ఆర్డర్ పై ఏం ఛెబుతాడు? వీ.ఉషారాణి అనే అధికారిద్వారా 28-12-2020న అక్రమ మైనింగ్ నిలుపుదల ఆర్డర్ నుఎందుకు స్టే చేశాడో చెప్పాలి.
మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఆర్డర్ లోని రిఫరెన్స్ నెం-4లో సర్వే అండ్ ల్యాండ్ సెటిల్ మెంట్ రికార్డుల గురించి ఎందుకు మాట్లాడలేదోచెప్పాలి. అటవీభూములను రెవెన్యూ భూములుగా మారుస్తూ, మన్మోహన్ సింగ్ తో ఎందుకు ఆర్డర్ ఇప్పించారో చెప్పాలి. సర్వే నెంబర్ 143 గురించి హైకోర్టు తీర్పు ఏమనిఉందో సరిగా అర్థంచేసుకొని మాట్లాడాలి.
సర్వేనెంబర్ 143లో 2007కు ముందు ఎందుకని ఒక్క మైనింగ్ లీజుకూడా లేదని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ వారు నివేదికి ఇచ్చారో వీరప్పన్ చెప్పాలి. వీటన్నింటికి సమాధానం చెప్పే ధైర్యం కొండపల్లి మైనింగ్ వీరప్పన్ కుఉంటే, ఆయన తక్షణమే హైకోర్టుకి సమాధానంచెప్పాలి. ఆరుగురు అటవీసిబ్బందిని ఎందుకు సస్పెండ్ చేశారో, మంగమ్మ అనే డీఎఫ్ వోను ఎందుకు బదిలీచేయించారో చెప్పాలి.
ఏ తప్పుచేయకపోతే, టీడీపీ వారిని అక్రమ మైనింగ్ ప్రాంతానికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారు? అక్కడంతా బాగుంటే, వీరప్పనే స్వయంగా టీడీపీవారిని తీసుకెళ్లొచ్చుకదా? దేవినేనిఉమా మహేశ్వరరావు గారు హైకోర్ట్ తీర్పుఇచ్చాక మైనింగ్ ప్రాంతానికి వెళ్లారా? లేక ముందే వెళ్లారా? డిసెంబర్ 27వతేదీన హైకోర్టు చాలాస్పష్టంగా, కొండపల్లి ప్రాంతంలో అక్రమమైనింగ్ జరుగుతోందని తీర్పుఇచ్చింది.
కోర్టు తీర్పువచ్చాక ఎప్పుడైనా దేవినేనిఉమా గారు మైనింగ్ ప్రాంతానికివెళ్లారా? తీర్పుఇవ్వకముందు ఆయన వెళ్లారని నేను చాలాస్పష్టంగా చెప్పాను. దాన్ని పట్టుకొని ఈ కల్లుతాగినకోతి ఏదేదో మాట్లాడితేఎలా? మైనింగ్ శాఖా డిప్యూటీ డైరెక్టర్ మైనింగ్ లీజులు రద్దుచేశాక , టీడీపీప్రభుత్వంలో దేవనేనిఉమా అక్కడకు వెళ్లింది లేదు. వీరప్పన్ తనకుతానే కష్టాలు కొనితెచ్చుకుంటున్నాడు.
ఏదోమాట్లాడి తమతో తలంటించుకొని నిద్రలేని రాత్రులు గడుపుతాడు. కాలేజ్ చదువులులేవని సిగ్గులేకుండా చెప్పుకుంటున్నాడు. అక్కడేదో జేబులుకొట్టేసి ఉంటాడు.. తన్ని తరమేసి ఉంటారు. మైలవరం వీరప్పన్ మీడియాముందు చేసిన సర్కస్ అంతా వట్టి కామెడీషో మాత్రమే. మైలవరం నియోజకవర్గంలో వీరప్పన్ చేసే అక్రమ మైనింగ్ ను రౌడీయిజాన్ని అడ్డుకొని తీరుతాము.
తప్పుడు కేసులు బనాయిస్తూ, తెలుగుదేశంపార్టీ కుటుంబసభ్యులను వేధింపులకు గురిచేస్తున్న మైలవరం వీరప్పన్ ను వదిలేదేలేదు. అన్నిరకాలుగా మైలవరం నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తాము.