సుప్రసిద్ధ శ్రీ కాళహస్తీశ్వరాలయంలో ఐదు రోజుల వార్షిక ప్రవిత్రోత్సవం జరుగుతుంది. మొదటి రోజైన మంగళవారం ఆలయంలోని గురు దక్షిణామూర్తి ముందు ప్రత్యేక పేటికలో 'శ్రీ' సాలీడు, 'కాళ' పాము, 'హస్తి' ఏనుగుల విగ్రహాలు, భరద్వాజ మహర్షి విగ్రహాలను ఉంచి వివిధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. ఇంకా ప్రత్యేక అభిషేకం, అలంకరణ జరిగింది.
అలాగే సంప్రోక్షణ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల చైర్మన్ అంజూరు తారక శ్రీనివాస్, పరిపాలనాధికారి సాగర్‌బాబు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సతీమణి, కుమార్తె, భక్తులు పాల్గొన్నారు. ఈ పవిత్రోత్సవం 29వ తేదీ వరకు జరగనుంది.
పవిత్రోత్సవం రోజులలో, మూడు కాలాల అభిషేకం, సాయంత్రం 6 గంటలకు ప్రదోష దీపారాధనను మాత్రమే ఆలయం నిర్వహిస్తుంది. భక్తులకు దీపారాధన టిక్కెట్లు, స్వామి దర్శనం కోసం ఆలయానికి వచ్చే వీఐపీలు, ప్రముఖులకు పూర్ణ కుంభ స్వీకరణ టిక్కెట్లు ఇవ్వరు.