పవన్ పలకలేదు.. నోరు మెదపలేదు.. కారణం ఏంటి?

మంగళవారం, 1 నవంబరు 2022 (12:02 IST)
పవన్ పలకలేదు.. నోరు మెదపలేదు.. కారణం ఏంటి.. మీడియా సమావేశంలో అస్సలు మాట్లాడలేదు. ప్రస్తుతం దీనిపైనే చర్చసాగుతోంది. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పవన్‌కళ్యాణ్‌ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేతల సమావేశం జరిగింది. 
 
అనంతరం అరగంటకుపైగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పవన్‌కళ్యాణ్‌ వేదికపై మౌనంగా కూర్చోగా, పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ మాట్లాడారు. ఒక దశలో పవన్‌ను మాట్లాడాలంటూ నాదెండ్ల సైగ చేస్తూ మైక్‌ జరిపినా స్పందించేందుకు నిరాకరించారు. 
 
ఆయన మీడియా సమావేశంలో మాట్లాడకపోవడానికి మౌనవ్రతం కారణమా లేకుంటే మీడియాతో మాట్లాడటం ఇష్టం లేకపోవడమా.. ఇటీవల పవన్ చేసిన కామెంట్స్ సంచలనం కావడంతో గొడవెందుకు సామీ అంటూ పవన్ మీడియా ముందు కామ్‌గా వుండిపోయాడా అని జనం మాట్లాడుకుంటున్నారు. మరి దీనిపై జనసేన ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు