యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ మేఘాలు చెప్పిన ప్రేమకథ ఓటీటీలో స్ట్రీమింగ్

చిత్రాసేన్

శనివారం, 27 సెప్టెంబరు 2025 (12:06 IST)
Naresh Agastya, Rabia Khatun
యూత్ కి నచ్చేలా ప్రేమ, సంగీత ప్రియులని కట్టిపడేసే మ్యూజిక్, అద్భుతమైన లొకేషన్స్‌తో తెరకెక్కిన మేఘాలు చెప్పిన ప్రేమకథ చిత్రం థియేటర్ లో అలరించి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. చూస్తున్నంత సేపు అద్భుతమై అనుభూతిని పంచే ఈ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం SunNXT ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఒక మధురమైన ప్రేమకథను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా, దర్శకుడు విపిన్ ఈ ప్రేమకథకు సరికొత్త శైలీలో తీర్చిదిద్ది విజయం సాధించారు. 
 
యూత్ ను కట్టిపడేసే ఈ రోమాంటిక్ ఎంటర్ టైనర్ కథ విషయానికి వస్తే.. వరుణ్‌ (నరేష్ అగస్త్య) ఒక ధనవంతుడి కొడుకు కానీ సొంతంగా ఏదో సాధించాలని, తన కళను నిరుపించుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. తన తండ్రి ఇష్టాలకు, ఆశయాలకు వ్యతిరేకంగా నడుచుకుంటాడు. ఇలా సాగుతుండగా.. వరణ్ కు మేఘన తో (రాబియా ఖతూన్‌) పరిచయం అవుతుంది. వారి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. ప్రేమగా మారిన బంధంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలతో కథ ఎలాంటి మలుపు తిరిగింది. అనేది చాలా అందంగా దర్శకుడు విపిన్ తెరకెక్కించారు. 
 
అందమైన లోకేషన్స్ లో కనుల పండుగలా ఉంటుంది ఈ చిత్రం. కుటుంబంతో పాటు హాయిగా చూడదగ్గ చిత్రం. కథలోని భావోద్వేగాలు మనసును ఆకట్టుకుంటాయి. హీరో, హీరోయిన్ మధ్య సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతీ ఒక్కరు కనెక్ట్ అయ్యేలా చాలా చక్కని రైటింగ్, అలాగే మనుసుకు తాకే మ్యూజిక్ తో సాగిపోతూ ఉంటుంది.  అలాగే నటన ప్రతిభతో అందరు కట్టిపడేస్తారు. లీడ్ రోల్ వరుణ్ పాత్రలోని మౌనాన్ని, భావాలను చాలా సున్నితంగా నరేష్ అగస్త్య ప్రదర్శించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అలాగే హీరోయిన్ రాబియా ఖతూన్ మేఘన పాత్రలో ఇమిడిపోయారు. చాలా ఉత్సాహంగా సహజత్వం ఉట్టిపడేలా నటించారు. ముఖ్యంగా ఆమె వ్యంగ్యహాస్యం, ఉల్లాసం ప్రేక్షకులను కట్టిపడేసింది. సపోర్టింగ్ క్యారెక్టర్ లో రాధికా శరత్‌కుమార్, సుమన్, తులసి, ఆమని పాత్రలు సినిమాకు మరింత బలం చేకూర్చాయి.
 
దర్శకుడు విపిన్ చాలా చక్కగా ఓ శిల్పంగా ఈ కథను చెక్కాడు. ప్రతీ ఫ్రేమ్, డైలాగ్ లో ఆయన పనితనం కనిపిస్తుంది. అలాగే ఇంత చక్కటి విజువల్స్ అందించిన మోహనకృష్ణ పనితనం మెప్పిస్తుంది. అందమైన లోకేషన్స్ కన్నుల పండుగలా చూపించారు. వల్పారై హిల్ స్టేషన్‌ సోయగాలు అద్భుతంగా చిత్రీకరించారు. సినిమాకు ప్రాణం పోసింది జస్టిన్ ప్రభాకరణ్ అందించిన సంగీతం. పాటలు మాత్రమే కాదు బీజీఎమ్ కూడా హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. అలాగే పాటలు విజువల్స్ గా కూడా చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఎంతో శ్రద్ధతో నిర్మాత ఉమాదేవి కోట ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్ గా, గ్రాండ్ ఉండాలంటే ఎంత శ్రద్ద తీసుకోవాలో అంతకు పదిరెట్లు మనసుపెట్టి నిర్మించారు. 
 
థియేటర్లో ప్రేక్షకులు మనుసు దోచుకున్న ఈ చిత్రం ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చేసింది. ప్రేమ, కలలు, కుటుంబ అనుబంధాల్ని గొప్పగా మిళితం చేసిన ఈ సినిమా, ప్రధానంగా యువతను, ఫ్యామిలీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కుటుంబ సమేతంగా తప్పక చూడాల్సిన ఫీల్‌గుడ్ మ్యూజికల్ లవ్ ఎంటర్‌టైనర్ చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమకథ. ఈ దసరా పండుగ సెలవుల్లో హాయిగా చూసేయండి. ప్రేమికులు, మ్యూజిక్ ఫాన్స్‌, మంచి ఎమోషనల్ డ్రామా కోరుకునే వారి కోసం SunNXT ఓటీటీలో అందుబాటులో ఉంది. అస్సలు మిస్ అవ్వొద్దు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు