ప్రభుత్వం ప్రజావేదిక ఒక్కదాన్నే కూల్చివేస్తే ప్రజలకు అనుమానం వస్తుందనీ, అలాకాకుండా రాష్ట్రంలో ఎన్ని అక్రమ కట్టడాలున్నాయో వాటన్నిటినీ కూల్చివేస్తే ఎవరకీ ఎలాంటి అనుమానాలు వుండబోవన్నారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిన కట్టడాలను కూల్చివేయడం కరెక్టేననీ, ఈ విషయంలో జగన్ సర్కార్ చిత్తశుద్ధితో చేస్తే తాము కూడా మద్దతిస్తామన్నారు. ఐతే కేవలం ప్రజావేదిక వరకే దాన్ని అమలుచేసి మిగిలినవాటి విషయంలో మీనమేషాలు లెక్కిస్తే ఖచ్చితంగా తాము ప్రశ్నిస్తామన్నారు.
జగన్ సర్కార్‌కి 100 రోజులు టైమిస్తామనీ, ఈ కాలంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఆచరణ తీరు గమనిస్తామన్నారు. మంచి నిర్ణయాలు తీసుకుంటే మద్దతిస్తాం... ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తే నిలదీస్తామని చెప్పారు.