మిరాయ్ సినిమా తర్వాత చాలా హ్యాపీగా వున్న నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ, మిరాయ్ తర్వాత మరో హిట్ సినిమా రాజా సాబ్ అవుతుందనే నమ్మకంగా వున్నాను. ఈ సినిమా ఇంతకుముందు వచ్చిన హార్రర్ సినిమాలకు భిన్నంగా వుంటుందని చెప్పారు.
సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. "రాజా సాబ్" సినిమాతో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నారు డైరెక్టర్ మారుతి.
నటీనటులు - ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, తదితరులు